త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priya Bhavani Shankar | పెళ్లి పీటలెక్కనున్న ‘ఇరుముడి’ హీరోయిన్‌.. ప్రియుడితో పదేళ్ల ప్రేమకు శుభం కార్డు..!

Priya Bhavani Shankar | సినీ ఇండస్ట్రీలో మరో హీరోయిన్‌ పెళ్లి వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన తమిళ నటి ప్రియా భవానీ శంకర్‌ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన చిరకాల ప్రియుడు రాజ్‌వేల్‌ రాజ్‌తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ఈ వార్తలకు కారణమైంది.

P

Entertainment | Published On Nov 10, 2026, 7.15 pm IST

Priya Bhavani Shankar | పెళ్లి పీటలెక్కనున్న ‘ఇరుముడి’ హీరోయిన్‌.. ప్రియుడితో పదేళ్ల ప్రేమకు శుభం కార్డు..!
Advertisement

Priya Bhavani Shankar | సినీ ఇండస్ట్రీలో మరో హీరోయిన్‌ పెళ్లి వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన తమిళ నటి ప్రియా భవానీ శంకర్‌ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన చిరకాల ప్రియుడు రాజ్‌వేల్‌ రాజ్‌తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ఈ వార్తలకు కారణమైంది. ఇద్దరి మెడలో మల్లెపూల దండలు ఉండడం, మరోవైపు ప్రియా చేతులకు మెహందీ అలంకరించుకున్న ఫొటోలు కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇవి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన చిత్రాలేనంటూ కోలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే పెళ్లి, నిశ్చితార్థంపై ప్రియా నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

కాలేజీ పరిచయం.. పదేళ్ల ప్రేమ!

ప్రియా భవానీ శంకర్‌, రాజ్‌వేల్‌ రాజ్‌ల పరిచయం కాలేజీ రోజుల్లో మొదలైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి దశాబ్దానికి పైగా కొనసాగుతోంది. హీరోయిన్‌గా కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ ప్రియా తన వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఈ జంట 2022లో కలిసి తమ కలల ఇంటిని కొనుగోలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. గతంలోనూ వీరి పెళ్లిపై పలుమార్లు ప్రచారం జరిగినా.. తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు మరోసారి చర్చకు దారితీశాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీ, వేదిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

న్యూస్‌ రీడర్‌ నుంచి హీరోయిన్‌గా..

ప్రియా భవానీ శంకర్‌ సినీ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. తొలుత టెలివిజన్‌ న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ టెలివిజన్‌ సీరియల్‌ ‘కల్యాణం ముదల్‌ కాదల్‌’తో నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం 2017లో విడుదలైన ‘మేయాద మాన్‌’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కడైకుట్టి సింగం, మాన్‌స్టర్‌, మాఫియా, తిరుచిత్రంబలం, యానై, పాతు తల, రుద్రన్‌, ఇండియన్‌ 2, డిమాంటీ కాలనీ 2, బ్లాక్‌, జీబ్రా, భీమా వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులోనూ పలు సినిమాలతో ప్రేక్షకులకు చేరువైంది.

చేతిలో వరుస ప్రాజెక్టులు

ప్రస్తుతం ప్రియా భవానీ శంకర్‌ కెరీర్‌ పరంగా కూడా బిజీగానే ఉంది. ఇటీవల ‘ఇరుముడి’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె.. తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. తమిళంలో డిమాంటీ కాలనీ 3, ‘మరగత నాణయం 2’ చిత్రాల్లో క‌నిపించ‌నుంది. అలాగే, తెలుగులో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాలోనూ నటించనున్నట్లు సినీ వర్గాల‌ సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు, ఇతర వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రియా సిద్ధమవుతున్నారనే వార్త అభిమానుల్లో ఆనందం నింపుతోంది. మల్లెపూల దండలు, మెహందీ ఫొటోలతో పెళ్లి సందడి మొదలైందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ ఫొటోలు ఏ వేడుకకు సంబంధించినవో, నిజంగానే పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయో ప్రియా స్పష్టం చేయాల్సి ఉంది. తన పదేళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారంటూ అభిమానులు మాత్రం ఈ జంటకు ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement
Advertisement