Indian 3 Movie | ‘భారతీయుడు3’కి లైన్ క్లియర్ – తిరిగి సెట్స్‌పైకి కమల్‌హాసన్ మూవీ – ముగ్గురు హీరోయిన్లతో
కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఇండియన్ 3కి లైన్ క్లియర్ అయ్యింది. సమస్యలు, వివాదాలను దాటుకొని ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి రాబోతుంది. మరో పది రోజుల్లో ఇండియన్ 3 షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు
Entertainment | Published On Oct 8, 2026, 4.02 pm IST
Indian 3 Movie |హీరో కమల్‌హాసన్ ,డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఇండియన్ 3కి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమాను తిరిగి సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 1996లొ వచ్చిన ఇండియన్‌కు కొనసాగింపుగా ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలను అనౌన్స్ చేశారు దర్శకుడు శంకర్.
డిజాస్టర్...
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ సీక్వెల్స్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియన్ 2 షూటింగ్‌లో ప్రమాదం జరగడంతో ముగ్గురు యూనిట్ సభ్యులు చనిపోయారు. ఈ వివాదానికి తోడు డైరెక్టర్ శంకర్‌తో నిర్మాత సుభాస్కరన్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అనేక అడ్డంకుల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేకపోయింది.
ఫెయిల్యూర్ ఎఫెక్ట్...
ఇండియన్2 ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఇండియన్ 3పై పడింది. సగానికిపైగా షూటింగ్ పూర్తయిన ఈ మూడో పార్ట్‌ను మేకర్స్ పక్కనపెట్టినట్లు ప్రచారం జరిగింది. సరైన బజ్ లేకపోవడంతో మిగిలిన చిత్రీకరణను పూర్తిచేయడానికి కమల్‌హాసన్‌తో పాటు డైరెక్టర్ శంకర్ ఆసక్తిగా లేరంటూ వార్తలొచ్చాయి. ఈ రూమర్లకు మేకర్స్ పుల్‌స్టాప్ పెట్టారు.
కొత్త పోస్టర్ రిలీజ్...
మరో పది రోజుల్లో ఇండియన్ 3 షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. గురువారం ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎడారిలాంటి ఓ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు గుర్రంపై వేగంగా వెళుతున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
సంక్రాంతికి...
భారతీయుడు 3 షూటింగ్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుతామని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రీకరణలో కమల్‌హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననున్నట్లు సమాచారం. త్వరలో రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ముగ్గురు హీరోయిన్లు...
మూడో పార్ట్‌లో బ్రిటీషర్లను ఎదురించి సేనాపతి సాగించిన పోరాటాన్ని పవర్‌ఫుల్‌గా దర్శకుడు శంకర్ ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. కమల్‌హాసన్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు ఈ మూడో పార్ట్‌కు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. భారతీయుడు 3లో కాజల్ అగర్వాల్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఎన్నికల సంఘం.. అది అధికారంలో ఉన్నవారికి రక్షణ కవచం కావొద్దు: హరీశ్ రావు
- ●Pinarayi Vijayan | అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం విజయన్‌పై చర్యలకు ఆదేశించిన హైకోర్టు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
- ●TGSRTC Elections | కొనసాగుతున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. డిపోల్లో ప్రశాంతంగా పోలింగ్
- ●Indian IT Companies | భారతీయ కంపెనీలపై పర్మ్ (PERM) వేటు.. అసలు ఇదేమిటి.. ఉద్యోగులపై ప్రభావం ఎంత?
- ●TGSP Constable | ఎర్రవల్లిలో టీజీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య

Harish Rao | ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఎన్నికల సంఘం.. అది అధికారంలో ఉన్నవారికి రక్షణ కవచం కావొద్దు: హరీశ్ రావు

Pinarayi Vijayan | అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం విజయన్‌పై చర్యలకు ఆదేశించిన హైకోర్టు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన పసిడి ధరలు..

TGSRTC Elections | కొనసాగుతున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. డిపోల్లో ప్రశాంతంగా పోలింగ్






