త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Irumudi Movie | హీరోయిన్ బుగ్గ‌పై ముద్దుపెట్టిన ర‌వితేజ – ఇరుముడిలో కోలీవుడ్ బ్యూటీ

ర‌వితేజ ఇరుముడి మూవీలో హీరోయిన్‌గా కోలీవుడ్ బ్యూటీ ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టిస్తోంది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ప్రియా భ‌వానీ శంక‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. హీరోయిన్ బుగ్గ‌పై ర‌వితేజ ముద్దు పెడుతున్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు.

N

Entertainment | Published On Feb 15, 2026, 11.12 am IST

Irumudi Movie | హీరోయిన్ బుగ్గ‌పై ముద్దుపెట్టిన ర‌వితేజ – ఇరుముడిలో కోలీవుడ్ బ్యూటీ
Advertisement

Irumudi Movie |  ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా వెయిటింగ్‌లో ఉన్నాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తితో క‌థ‌ల ఎంపిక‌లో త‌న రూటు మార్చేశాడు. త‌న‌కు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన మాస్ క‌థ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టేశాడు. ఫ్యామిలీ క‌థ‌ల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఇరుముడి పేరుతో ఓ డిఫ‌రెంట్ సినిమా చేస్తున్నాడు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ జోడించి తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు మ‌జిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

కోలీవుడ్ హీరోయిన్‌...

ఇరుముడిలో ర‌వితేజ‌కు జోడీగా కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఆదివారం ప్రియా భ‌వానీ శంక‌ర్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. కావేరి అనే పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

బుగ్గ‌పై ముద్దు...

ప్రియా భ‌వానీ శంక‌ర్ బుగ్గ‌పై ర‌వితేజ ముద్దుపెడుతున్న‌ట్లుగా ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఇందులో చీర‌క‌ట్టులో ప‌ల్లెటూరి అమ్మాయిగా ర‌స్టిక్ లుక్‌లో హీరోయిన్ క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇరుముడిలో ర‌వితేజ‌తో పాటు ప్రియా భ‌వానీ శంక‌ర్ క్యారెక్ట‌ర్స్ హై ఎమోష‌న్స్‌తో సాగుతాయ‌ని స‌మాచారం. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఇరుముడి ఉంటుంద‌ని అంటున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌....

ఇరుముడి షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సాయికుమార్‌, అజ‌య్ ఘోష్‌, ర‌మేష్, స్వాసిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఖుషి త‌ర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంత‌రం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌, స‌మంత హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

క‌ళ్యాణం క‌మ‌నీయం...

త‌మిళ హీరోయిన్ అయిన ప్రియా భ‌వానీ శంక‌ర్ ఇరుముడి కంటే ముందు తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. క‌ళ్యాణం క‌మ‌నీయం, జీబ్రా, భీమాతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క‌థానాయిక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. త‌మిళంలో డీమాంటే కాల‌నీ 3, ఇండియ‌న్ 3తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తోంది.

Advertisement
Advertisement