Goreti Venkanna | నటుడిగా గోరటి వెంకన్న – “రాజిగాడు రాజయ్యాడు” ఫస్ట్ లుక్ రిలీజ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నటుడిగా మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. రాజిగాడు రాజయ్యాడు సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనుశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Nov 16, 2026, 7.44 pm IST
Goreti Venkanna | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రజా కవి గోరటి వెంకన్న సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటుడిగా కెమెరా ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో "రాజిగాడు రాజయ్యాడు" పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ సోమవారం రిలీజయ్యాయి.
గఢీ బయట...
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పెద్ద గఢీ బయట ఒంటిపై గాయాలతో ఒక పంది పిల్లను చేతిలో పట్టుకుని కుర్చీలో హీరో కూర్చుని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అతడి చుట్టూ కుల వృత్తులకు సంబంధించిన పని ముట్లు కనిపిస్తున్నాయి. ఆ పెద్ద గఢీ లోని వారికి హీరోకు ఉన్న సంబంధం ఏంటి ? పంది పిల్లను ఎందుకు చేతిలో పట్టుకున్నాడు?అనే అంశాలతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. రాజిగాడు ఎవరు... ఎలా రాజయ్యాడు అన్నది ఉత్కంఠను పంచుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
అనుశ్రీ హీరోయిన్...
"రాజిగాడు రాజయ్యాడు" సినిమాలో అనుశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. గోరటి వెంకన్న క్యారెక్టర్, ఆయన నటన ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని, కథ నచ్చి ఇందులో నటించడానికి ఆయన అంగీకరించారని మేకర్స్ పేర్కొన్నారు. కులవృత్తుల నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం.
బట్టల రామస్వామి...
బట్టల రామస్వామి బయోపిక్కు తర్వాత అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు జగదీష్ సత్యన్ సంగీతం అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?
- ●Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!
- ●Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు
- ●Cyclone Akvan | ఏపీపై 'అక్వాన్' తుఫాన్ పంజా.. అమరావతికి మళ్లీ ముంపు ముప్పు!
- ●Rashmika Mandanna | ఏనాటి వరమో నువ్వు - తండ్రి ప్రేమను గుర్తుచేసుకున్న రష్మిక
- ●TGSRTC New MD Dr Anil Kumar | టీజీఎస్ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్

Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?

Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు

Cyclone Akvan | ఏపీపై 'అక్వాన్' తుఫాన్ పంజా.. అమరావతికి మళ్లీ ముంపు ముప్పు!





