Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ – ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ (Malayalam Thriller)మూవీ ఖలీఫా ఒకే రోజు ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అవుతోంది అక్టోబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తెలుగు, మనోరమా మ్యాక్స్, స్టార్ ప్లే, లయన్స్ గేట్ ప్లేతో పాటు సింప్లీ సౌత్ ఓటీటీలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మలయాళం మూవీలో టాలీవుడ్ బ్యూటీ మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించింది.,
Entertainment | Published On Oct 6, 2026, 2.36 pm IST
Malayalam OTT | మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసిలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్‌గా నటిస్తోన్నాడు. ఈ టైమ్ ట్రావెల్ మూవీలో కుంభా అనే పాత్రలో కనిపించబోతున్నాడు. గత రెండేళ్లుగా ఓ వైపు వారణాసి షూటింగ్‌లో పాల్గొంటూనే ఈ గ్యాప్‌లో మలయాళంలో ఐదు సినిమాలు పూర్తిచేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. వాటిలో ఖలీఫా ఒకటి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ వైశాఖ్ దర్శకత్వం వహించారు.
మోహన్‌లాల్...
గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన ఖలీఫా సినిమాలో మోహన్‌లాల్, టోవినో థామస్, సౌబీన్ షాహిర్ గెస్ట్‌లుగా కనిపించారు. టాలీవుడ్ బ్యూటీ మాళవికా శర్మ ( Malvika Sharma )హీరోయిన్‌గా నటించింది.
ఆరు ఓటీటీలలో...
థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ తాజాగా ఓటీటీలోకి వస్తోంది. ఒకే రోజు ఆరు ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తెలుగు, మనోరమా మ్యాక్స్, స్టార్ ప్లే, లయన్స్ గేట్ ప్లేతో పాటు సింప్లీ సౌత్ ఓటీటీలలో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతోంది.
మలయాళంలోకి ఎంట్రీ...
ఖలీఫాతో మాళవికా శర్మ హీరోయిన్‌గా మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ దేశ్‌ముఖ్ విలన్‌గా కనిపించాడు. ఖలీఫా మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన, అతడిపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. వైశాఖ్ టేకింగ్ విషయంలో విమర్శలొచ్చాయి. 1980-90 స్టైల్‌లో తీసిన సినిమా ఉదంటూ నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.
గోల్డ్ స్మగ్లింగ్...
అమీర్ అలీ ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఫిజా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఓ చిన్న బట్టల షాప్ పెట్టుకొని సంతోషంగా జీవిస్తుంటాడు. అమీర్ అలీ తండ్రిని గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేస్తారు. చేయని తప్పుకు తండ్రి శిక్షను అనుభవించడం అమీర్ అలీని బాధపెడుతోంది. తన తండ్రికి జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకోవడానికి తానే గోల్డ్ స్మగ్లింగ్‌లోకి అడుగుపెడతాడు? ఆ తర్వాత ఏమైంది. ప్రత్యర్థి బషీర్ నుంచి అమీర్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ – యాక్షన్ విత్ వయలెన్స్ – రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్
అక్టోబర్ 5, 2026

OTT Releases | ఈ వీక్ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ తెలుగు హారర్ మూవీ స్పెషల్
సెప్టెంబర్ 25, 2026

Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●UP SIR | యూపీ ఓటరు లిస్టులో కొత్తగా చేర్చిన ఆ 16 లక్షల మంది ఎవరు..?
- ●B Vinod Kumar | రామప్ప ఆలయం దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓప్పుకోం
- ●Nabha Natesh | నభానటేష్ కెమిస్ట్రీ - తొమ్మిదేళ్ల తర్వాత మాతృభాషలోకి ఇస్మార్ట్ బ్యూటీ రీఎంట్రీ
- ●Harmanpreet Kaur | కెప్టెన్సీకి గుడ్‌బై.. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం
- ●Ponnam Prabhakar | జ్ఞానేశ్‌కుమార్! రాజీనామా చెయ్
- ●SIP | వేతనంలో ఎస్ఐపీ కోసం ఎంత శాతం కేటాయించాలి.. 50-30-20 నియమం ఏమిటి..?

UP SIR | యూపీ ఓటరు లిస్టులో కొత్తగా చేర్చిన ఆ 16 లక్షల మంది ఎవరు..?

B Vinod Kumar | రామప్ప ఆలయం దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓప్పుకోం

Nabha Natesh | నభానటేష్ కెమిస్ట్రీ - తొమ్మిదేళ్ల తర్వాత మాతృభాషలోకి ఇస్మార్ట్ బ్యూటీ రీఎంట్రీ

Harmanpreet Kaur | కెప్టెన్సీకి గుడ్‌బై.. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం



