Preity Mukhundhan | రూటు మార్చిన హిట్ డైరెక్టర్ – కన్నప్ప హీరోయిన్‌తో రొమాంటిక్ మూవీ
కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ తెలుగులో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హిట్ యూనివర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏమో ఏమో ఇది అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు.
Entertainment | Published On Feb 14, 2026, 2.39 pm IST
Preity Mukhundhan | హిట్ యూనివర్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. హిట్ యూనివర్స్‌లో భాగంగా హిట్ 4 కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. నాలుగో పార్ట్‌లో కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా నటించబోతున్నాడు.
రొమాంటిక్ లవ్‌స్టోరీ...
హిట్ 4 కంటే ముందే శైలేష్ కొలను మరో సినిమా చేయబోతున్నాడు. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్‌కు భిన్నంగా ఫస్ట్ టైమ్ ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీని తెరకెక్కించబోతున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా శనివారం ఈ మూవీని అఫీషియల్‌గా ప్రకటించారు. శైలేష్ కొలను కొత్త మూవీకి ఏమో ఏమో ఇది అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కన్నప్ప ఫేమ్, మలయాళ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
అభయ్...అపూర్వ...
ఓ వీడియో గ్లింప్స్‌తో ఈ మూవీ టైటిల్‌తో పాటు హీరోహీరోయిన్ల పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. అభయ్‌గా రోషన్...అపూర్వగా ప్రీతి ముకుందన్ కనిపించబోతున్నట్లు ప్రకటించారు.
ఓ కాఫీ డేలో తల్లీకొడుకుల మధ్య ఫన్నీ డిస్కషన్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది. వయసులో ఉన్నావు..స్మార్ట్‌గా ఉన్నావు...నువ్వేందుకు సింగిల్‌గా ఉన్నావు అని తన కొడుకును తల్లి అడగటం ఆకట్టుకుంది. ఒంటికాయ సొంటికొమ్ములా అలాగే ఉంటావా అని అడగ్గానే...నాకు దేవుడు ఏదో ఒక అమ్మాయిని రాసి పెట్టి ఉంటాడు...చూద్దాం అని హీరో బదులివ్వడం...ఆ తర్వాత హీరోయిన్ పరిచయంతో గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. లవ్‌స్టోరీలో ట్విస్ట్‌లు, టర్న్‌లు, మసాలా అన్ని ఉంటాయి జాగ్రత్త అంటూ కొడుకుతో తల్లి చెప్పడం గ్లింప్స్‌కు హైలైట్‌గా ఉంది. ఆ కాఫీ డే ఓనర్... హీరోయిన్ అంటూ రివీలయ్యే ట్విస్ట్‌తో గ్లింప్స్ ఎండయ్యింది. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన మెలోడీ సాంగ్ బాగుంది.
దసరాకు రిలీజ్...
ఏమో ఏమో ఇది మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటన్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కన్నప్ప తర్వాత తెలుగులో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్న సెకండ్ తెలుగు మూవీ ఇది. ఇటీవలే సర్వంమాయ మూవీలో మలయాళంలోబిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. మరోవైపు ఈ ఏడాది ఛాంపియన్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు రోషన్ మేక. ఇందులో తెలంగాణ ఉద్యమకారుడిగా యాక్షన్ రోల్‌లో కనిపించాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






