త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Preity Mukhundhan | రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన క‌న్న‌ప్ప హీరోయిన్ – శ‌ర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందంటే?

స‌ర్వం మాయ‌, బ్లాస్ట్ జోన్‌ల‌తో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్న‌ది కోలీవుడ్ సుంద‌రి ప్రీతి ముకుంద‌న్‌. ఈ విజ‌యాల‌తో రెమ్యూన‌రేష‌న్‌ను డ‌బుల్ చేసింద‌ట‌. శ‌ర్వానంద్, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కోసం ప్రీతి ముకుంద‌న్ భారీ మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jun 18, 2026, 3.25 pm IST

Preity Mukhundhan | రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన క‌న్న‌ప్ప హీరోయిన్ – శ‌ర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందంటే?
Advertisement

Preity Mukhundhan |  మాతృభాష త‌మిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ‌గా బిజీ అవుతోంది ప్రీతి ముకుంద‌న్ . శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కోలీవుడ్ బ్యూటీ క‌న్న‌ప్ప‌లో హీరోయిన్‌గా క‌నిపించింది. ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఏమో ఏమో ఇది అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోంది. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ ఇందులో హీరోగా న‌టిస్తోన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ప్రీతి ముకుంద‌న్ మ‌రో ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

శ‌ర్వానంద్ సినిమాలో...

శ‌ర్వానంద్ హీరోగా సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రాబోతుంది. క‌న్ఫ్యూజ‌న్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా బుధ‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. సింపుల్‌గా ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జార్జ్ క్రిష్ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం.

డ‌బుల్‌...

ఈ రొమాంటిక్ మూవీలో శ‌ర్వానంద్‌కు జోడీగా ప్రీతి ముకుంద‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నార‌ట‌. ఈ సినిమా కోసం కోలీవుడ్ సుంద‌రి రెమ్యూన‌రేష‌న్‌ను డ‌బుల్ చేసిన‌ట్లు స‌మాచారం. మొన్న‌టివ‌ర‌కు సినిమాకు కోటి రూపాయ‌లు మాత్ర‌మే తీసుకున్న‌ద‌ట‌. స‌ర్వం మాయ‌, బ్లాస్ట్‌జోన్ విజ‌యాల‌తో ఈ అమ్మ‌డికి తెలుగుతో పాటు త‌మిళంలో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ స‌క్సెస్‌ల‌తో రెమ్యూన‌రేష‌న్‌ను పెంచేసిన ప్రీతి ముకుంద‌న్‌...శ‌ర్వానంద్ సినిమా కోసం రెండు కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.

బాలీవుడ్‌లో...

ప్ర‌స్తుతం ఏమో ఏమో ఇదితో పాటు త‌మిళంలో ఇద‌యం ముర‌ళి, ద‌శ‌మ‌కాన్ సినిమాలు చేస్తోంది ప్రీతి ముకుంద‌న్‌. కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తోన్న నాగ్జిల్లాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

 

Advertisement
Advertisement