త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Preity Mukhundhan | బ్లాస్ట్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా – గ‌ణిత మేధావి మునిమ‌న‌వ‌రాలు అంటూ ప్ర‌చారం?

బ్లాస్ట్ హీరోయిన్ ప్రీతి ముకుంద‌న్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌పై సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. భార‌తీయ గ‌ణిత మేధావి శ్రీనివాస రామానుజ‌న్‌కు ప్రీతి ముకుంద‌న్ ముని మ‌న‌వ‌రాలు అవుతుంద‌ని అంటున్నారు. ఈ రూమ‌ర్ల‌లో నిజ‌మెంత అంటే?

N

Entertainment | Published On Jul 18, 2026, 5.17 pm IST

Preity Mukhundhan | బ్లాస్ట్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా – గ‌ణిత మేధావి మునిమ‌న‌వ‌రాలు అంటూ ప్ర‌చారం?
Advertisement

Preity Mukhundhan |  ఇటీవ‌ల రిలీజైన బ్లాస్ట్ మూవీతో పెద్ద హిట్టును అందుకుంది ప్రీతి ముకుంద‌న్‌. అప్ప‌టివ‌ర‌కు సాఫ్ట్‌ రోల్స్ చేస్తూ వ‌చ్చిన ఈ బ్యూటీ బ్లాస్ట్‌లో యాక్ష‌న్ పాత్ర‌లో క‌నిపించి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్య‌మున్న అమ్మాయిగా త‌న న‌ట‌న‌తో మెప్పించింది. కేవ‌లం ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన బ్లాస్ట్ సినిమా డెబ్బై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది త‌మిళంలో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది. బ్లాస్ట్‌తో తెలుగులోనూ ఈ అమ్మ‌డికి మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

గ‌ణిత మేధావి....

కాగా ప్రీతి ముకుంద‌న్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. భార‌తీయ గ‌ణిత మేధావి శ్రీనివాస రామానుజ‌న్‌కు ప్రీతి ముకుంద‌న్ ముని మ‌న‌వ‌రాలు అవుతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. శ్రీనివాస రామానుజ‌న్ ఫ్యామిలీతో ప్రీతి ముకుంద‌న్ కుటుంబానికి చాలా ద‌గ్గ‌రి బంధుత్వం ఉంద‌ని అంటున్నారు. లెజెండ‌రీ మ్యాథ‌మెటీషియ‌న్ కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి మంచి యాక్ట‌ర్‌గా నిరూపించుకోవ‌డం గ్రేట్ అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ప్రీతి ముకుంద‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

నిజం లేదా?

మ‌రొకొంద‌రు నెటిజ‌న్లు మాత్రం శ్రీనివాస రామానుజ‌న్‌కు ప్రీతి ముకుంద‌న్‌తో ఎలాంటి సంబంధం లేద‌ని అంటున్నారు. శ్రీనివాస‌రామానుజ‌న్ 32 ఏళ్ల‌కే చ‌నిపోయారు. ఆయ‌న‌కు పిల్ల‌లు లేక‌పోవ‌డంతో ఆయ‌న భార్య ...నారాయ‌ణ‌న్ అనే అబ్బాయిని ద‌త్త‌త తీసుకున్నారు. ద‌త్త‌త తీసుకున్న అబ్బాయితో ప్రీతి ముకుంద‌న్ ఫ్యామిలీకి రిలేష‌న్ ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రొకొంద‌రు నెటిజ‌న్లు మాత్రం రామానుజ‌న్ మేన‌కోడ‌లికి ప్రీతి ముకుంద‌న్ మ‌న‌వ‌రాలు అవుతుంద‌ని అంటున్నారు. ఈ హీరోయిన్ త‌ల్లి వైపు నుంచే గ‌ణిత మేధావి కుటుంబానికి బంధుత్వం ఉండొచ్చ‌ని చెబుతున్నారు. ఈ పుకార్ల‌లో ఏది నిజ‌మ‌న్న‌ది క్లారిటీ లేదు. ప్రీతి రియాక్ట్ అయితేనే నిజానిజాలేమిట‌న్న‌ది బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

క‌న్న‌ప్ప‌...ఓం భీమ్ బుష్‌

ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ప్రీతి ముకుంద‌న్ అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఓం భీమ్ బుష్‌, క‌న్న‌ప్ప సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో ఏమో ఏమో ఇది పేరుతో రొమాంటిక్ ల‌వ్‌స్టోరీలో న‌టిస్తోంది. రోష‌న్ మేక హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాగ్జిల్లా మూవీతో ప్రీతి ముకుంద‌న్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

 

Advertisement
Advertisement