త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Spirit Movie | సందీప్ వంగాతో గొడ‌వ‌లు – ప్ర‌భాస్ స్పిరిట్ నుండి త‌ప్పుకున్న ప్ర‌కాష్‌రాజ్ – రూమ‌ర్ల‌పై క్లారిటీ

ప్ర‌భాస్ స్పిరిట్ మూవీ నుంచి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ అర్ధాంత‌రంగా త‌ప్పుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్ సందీప్ వంగాతో ఏర్ప‌డిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తోనే ప్ర‌కాష్ రాజ్ ఈ సినిమా నుంచి వైదొలిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై ప్ర‌కాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.

N

Entertainment | Published On Feb 9, 2026, 3.58 pm IST

Spirit Movie | సందీప్ వంగాతో గొడ‌వ‌లు – ప్ర‌భాస్ స్పిరిట్ నుండి త‌ప్పుకున్న ప్ర‌కాష్‌రాజ్ – రూమ‌ర్ల‌పై క్లారిటీ
Advertisement

Spirit Movie | రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ వంగా క‌ల‌యిక‌లో రూపొందుతోన్న స్పిరిట్ మూవీకి సంబంధించి రోజుకో రూమ‌ర్‌ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. హై ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను 2022లో అనౌన్స్‌చేశారు. మూడేళ్లు దాటిపోయినా షూటింగ్ మొద‌లుకాక‌పోవ‌డంతో స్పిరిట్‌ ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ రూమ‌ర్ల‌కు చెక్ పెడుతూ గ‌త ఏడాది ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వాయిస్ టీజ‌ర్‌ను రిలీజ్ చేసి అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు సందీప్ వంగా. డిసెంబ‌ర్‌లో స్పిరిట్ షూటింగ్‌ను మొద‌లుపెట్టారు. ప్ర‌భాస్‌పై ఓ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ను చిత్రీక‌రించారు.

రొమాంటిక్ సీన్స్‌...

రాజాసాబ్ ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా స్పిరిట్ షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. మార్చిలో నెక్స్ట్ షెడ్యూల్ మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం. డార్జిలింగ్‌లో ప్ర‌భాస్‌, హీరోయిన్ త్రిప్తి డిమ్రిపై రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

జైల‌ర్ పాత్ర‌లో...

కాగా స్పిరిట్ సినిమాలో జైల‌ర్‌గా ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రోజు రిలీజ్ చేసిన వాయిస్ టీజ‌ర్‌కు ప్ర‌కాష్ రాజ్ డ‌బ్బింగ్ చెప్పారు. కాగా డైరెక్ట‌ర్ సందీప్ వంగాతో ఏర్ప‌డిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా స్పిరిట్ మూవీ నుంచి ప్ర‌కాష్ రాజ్ త‌ప్పుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. షూటింగ్ సెట్స్‌లో ప్ర‌కాష్ రాజ్‌తో సందీప్ వంగా ఆర్గ్యూమెంట్స్ చేశాడ‌ని, డైరెక్ట‌ర్ తీరు న‌చ్చ‌క విల‌క్ష‌ణ న‌టుడు సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ని ట్వీట్స్‌, పోస్ట్‌లు పెడుతున్నారు.

రూమ‌ర్ల‌పై క్లారిటీ...

ఈ రూమ‌ర్ల‌పై ప్ర‌కాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. "స్పిరిట్ సినిమాకు సంబంధించిన త‌న పాత్ర తాలూకు షూటింగ్ ఇంకా మొద‌లుకాలేదు. ఈ అబ‌ద్ద‌పు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసే ప‌ద్ద‌తిని మార్చుకుంటే బాగుంటుంది. వాట్స‌ప్ గ్రూపుల‌లో వ్యాప్తి చేయ‌డానికి ఇలాంటి లేనిపోని క‌థ‌నాల‌ను అల్లొద్దు" అంటూ ఓ ట్వీట్ పెట్టారు. ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.
స్పిరిట్ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 మార్చి 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Advertisement
Advertisement