Prakash Raj | ధురంధర్ 2పై ప్రశంసలు – టాలీవుడ్ హీరోలను ఏకిపడేసిన ప్రకాష్ రాజ్
ధురంధర్ 2ను ప్రశంసిస్తూ టాలీవుడ్ హీరోలు చేసిన ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ ట్వీట్స్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరోలను ప్రకాష్ రాజ్ ఏకిపడేశాడు. తెలుగు స్టార్స్‌పై సెటైర్లు వేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Mar 21, 2026, 10.17 am IST
Prakash Raj | రణవీర్‌సింగ్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. హిందీ ఇండస్ట్రీ గత రికార్డులన్నింటిని ఈ సినిమా తుడిచిపెట్టేసింది. ధురంధర్ 2 మేనియా నార్త్‌నే కాకుండా సౌత్‌ను ఊపేస్తోంది. దక్షిణాది ఆడియెన్స్‌ను సైతం ఈ మూవీ మెప్పిస్తోంది. సగటు సినీ అభిమానులే కాకుండా స్టార్ హీరోలు, దిగ్గజ దర్శకులు సైతం ధురంధర్ 2 అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తోన్నారు. ఈ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తోన్నాయి. ఇదొక ప్రొపగండా మూవీ అంటూ కొందరు కామెంట్లు పెడుతోన్నారు.
ప్రకాష్ రాజ్ ట్వీట్స్...
ధురంధర్ 2 మూవీపై టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వరుస ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ బాలీవుడ్ మూవీపైనే కాకుండా ఈ సినిమాను ప్రశంసించిన టాలీవుడ్ హీరోలపై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు.
ధురంధర్‌కు దూరం...
ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్‌లో 1961 నాటి క్లాసిక్ సాంగ్ "అభీ నా జావో చోడ్ కర్" వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు . "నేను ధురంధర్ సినిమాకు దూరంగా ఉన్నాను . మరి మీరు?" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీ చూడొద్దంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో టాలీవుడ్ హీరోలను ఏకిపడేశాడు ప్రకాష్ రాజ్. ధురంధర్ 2ను ప్రశంసిస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
మొహమాటాలు...
వారి ట్వీట్స్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ రియాక్ట్ అయ్యారు. "కృతజ్ఞత తీర్చుకోవాల్సిన అవసరాలు ఇప్పుడు దక్షిణాదికి పాకుతున్నాయి" అంటూ విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లు, మొహమాటం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధురంధర్ 2ను టాలీవుడ్ హీరోలు పొగడక తప్పడం లేదంటూ ప్రకాష్ రాజ్ ఇన్‌డైరెక్ట్‌గా తెలుగు హీరోలపై సెటైర్లు వేశాడని నెటిజన్లు అంటున్నారు.
బాలీవుడ్ హీరోలు...
ప్రకాష్ రాజ్ మాత్రమే కాకుండా నెటిజన్లు కూడా తెలుగు హీరోలను ట్రోల్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్‌ఖాన్‌తో పాటు ఇతర బాలీవుడ్ హీరో కూడా ధురంధర్ 2ను మెచ్చుకుంటూ ట్వీట్స్ వేయలేదని, అలాంటప్పుడు తెలుగు హీరోలు పోటీపడి ప్రశంసలు కురిపించడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ధురంధర్ 2 ప్రొపగండా మూవీ అని కామెంట్లు చేశాడు. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆదిత్య ధర్ ఈ సినిమా తీశాడంటూ అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



