త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | రెమ్యూన‌రేష‌న్ ఇస్తేనే డ‌బ్బింగ్ – న‌య‌న‌తార‌కు షాకిచ్చిన యంగ్ హీరో

న‌య‌న‌తార‌కు యంగ్ హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ పెద్ద షాకిచ్చాడు. న‌య‌న‌తార ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తున్నారు. రెమ్యూన‌రేష‌న్ పెండింగ్ ఉండ‌టంతో ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ప్ర‌దీప్ అంగీక‌రించ‌లేద‌ని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Mar 24, 2026, 4.34 pm IST

Nayanthara | రెమ్యూన‌రేష‌న్ ఇస్తేనే డ‌బ్బింగ్ – న‌య‌న‌తార‌కు షాకిచ్చిన యంగ్ హీరో
Advertisement

Nayanthara |  ద‌క్షిణాదిలో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది న‌య‌న‌తార‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో స‌త్తా చాటుతోంది. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా కూడా కంటెంట్ ప్ర‌ధాన‌ సినిమాలను నిర్మిస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. స్వీయ నిర్మాణ సంస్థ‌రౌడీ పిక్చర్స్‌పై న‌య‌న‌తార నిర్మించిన ప‌లు సినిమాలు అవార్డుల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. రౌడీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన‌ ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఏప్రిల్ 3న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. న‌య‌న‌తార నిర్మించిన ఈ సినిమాకు ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించారు.

నాలుగు సార్లు వాయిదా...

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లోనే ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల నాలుగు సార్లు వాయిదాప‌డింది. ఏప్రిల్ 3న ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స‌య్యారు. కానీ ఈ సారి కూడాల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుద‌ల కావ‌డం అనుమాన‌మేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేదా...

రిలీజ్‌కు మ‌రో ప‌ది రోజులు మాత్ర‌మే టైమ్ ఉంది. కానీ ఇప్ప‌టికీ ఈ సినిమాకు హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ డ‌బ్బింగ్ చెప్ప‌లేద‌ట‌. హీరో ప్ర‌దీప్‌కు న‌య‌న‌తార ఇస్తాన‌ని క‌మిట్ అయిన రెమ్యూన‌రేష‌న్‌ను ఇప్ప‌టివ‌ర‌కుపూర్తిగా చెల్లించ‌లేద‌ట‌. పెండింగ్ రెమ్యూన‌రేష‌న్ క్లియ‌ర్ చేసే వ‌ర‌కు డ‌బ్బింగ్ చెప్పేది లేద‌ని ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ఫిక్సైన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో న‌య‌న్ టీమ్ చేసి సంప్ర‌దింపులు మొత్తం ఫెయిలైన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అనుకున్న బ‌డ్జెట్‌కు మించి న‌య‌న‌తార ఈ సినిమా కోసం ఖ‌ర్చుచేసిన‌ట్లు స‌మాచారం. రిలీజ్ డిలే కావ‌డం, సినిమాపై అంత‌గా బ‌జ్ లేక‌పోవ‌డంతో ఓటీటీ డీల్ కూడా క్లోజ్ కాలేద‌ట‌. ఈ క‌ష్టాల‌కు తోడు ఇప్పుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ కూడా హ్యాండివ్వ‌డంతో మ‌రోసారి ఈ సినిమా పోస్ట్‌పోన్ కావ‌డం ఖాయ‌మంటూ రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

బాల‌కృష్ణ‌తో...

ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ దెబ్బ‌కు సినిమా నిర్మాణానికి కొన్నాళ్లు దూరం కావాల‌ని న‌య‌న‌తార నిర్ణ‌యించుకుంద‌ని అంటున్నారు. కేవ‌లం హీరోయిన్‌గా మాత్ర‌మే సినిమాలు చేయాల‌ని అనుకుంటుంద‌ట‌.
ప్ర‌స్తుతం న‌య‌న‌తార తెలుగులో బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తోంది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానుంది. త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో న‌య‌న‌తార న‌టిస్తున్న ఏడు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement