Sreemukhi | బిగ్‌బాస్ జోడీ సీజన్ 2కు కొత్త హోస్ట్ – శ్రీముఖి బెటర్ అంటూ నెటిజన్ల కామెంట్స్!
Sreemukhi | బిగ్‌బాస్ జోడీ సీజన్ 2కు హోస్ట్ ఫిక్సయ్యాడు. శ్రీముఖి (Sreemukhi) స్థానంలో ప్రదీప్ మాచిరాజును (Pradeep Machiraju) హోస్ట్‌గా స్టార్ మా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే బిగ్‌బాస్ జోడీ సీజన్ ను ప్రోమో రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Dec 8, 2025, 3.55 pm IST
శ్రీముఖి
Sreemukhi | బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 9 ఎండింగ్‌కు వచ్చేసింది. డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలేను నిర్వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరన్నది నెక్స్ట్ వీక్‌లో డిసైడ్ కాబోతుంది. ఇప్పటికే కళ్యాణ్ పడాల (Kalyan Padala) ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు.
బిగ్‌బాస్ సీజన్ 9 ముగిసిన వెంటనే బిగ్‌బాస్ జోడీ సీజన్ 2ను లాంఛ్ చేసేందుకు స్టార్ మా సన్నాహాలు చేస్తోంది. బిగ్‌బాస్ జోడీ నయా సీజన్ కోసం కొత్త హోస్ట్‌గా ప్రదీప్ మాచిరాజు రంగంలోకి దిగబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రదీప్ మాచిరాజుతో ప్రోమో షూట్‌ను ఇటీవలే కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఈ ప్రోమోతోనే బిగ్‌బాస్ జోడీ సీజన్ 2ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేయనున్నట్లు తెలిసింది. అంతే కాకుండా కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఈ ప్రోమో ద్వారా రివీల్ చేయనున్నారట.
శ్రీముఖిని పక్కనపెట్టి?
కాగా బిగ్‌బాస్ జోడీ గత సీజన్‌కు శ్రీముఖి (Sreemukhi) యాంకర్‌గా వ్యవహరించింది. తన కామెడీ టైమింగ్, మాటతీరుతో హోస్ట్‌గా అదరగొట్టింది. శ్రీముఖి కారణంగానే టీఆర్‌పీలో బిగ్‌బాస్ జోడీ టాప్‌లో నిలిచింది. సీజన్ 2 కోసం శ్రీముఖిని పక్కనపెట్టి ప్రదీప్‌ను హోస్ట్‌గా ఫిక్స్ చేయడంతో బుల్లితెర ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతున్నారు.బిగ్‌బాస్ జోడీకి శ్రీముఖి యాంకర్ అయితేనే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్‌బాస్ జోడీ సీజన్ 2 లో రీతూ చౌదరి, సంజన గర్లానీ, ఫ్లోరా షైనీ, దేబ్జానీ మోదక్, తనూజ, ఇమాన్యుయేల్, కళ్యాణ్, రాము రాథోడ్, శ్రేష్టి వర్మతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్‌గా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఈ డ్యాన్స్ రియాలిటీ షో స్టార్ మాతో పాటు జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారంతో పాటు తెలుగులో మరికొన్ని టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది శ్రీముఖి.
మరోవైపు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రదీప్ మాచిరాజు. ఈ సినిమా కారణంగా కొన్నాళ్లు టీవీ షోస్‌కు గ్యాప్ ఇచ్చారు. బిగ్‌బాస్ జోడీతో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Divvela Madhuri | సినిమాల్లోకి దువ్వాడ మాధురి ఎంట్రీ – గైరమ్మత్తగా బిగ్ స్క్రీన్‌పై రచ్చ
ఏప్రిల్ 28, 2026

Divvela Madhuri | తిరుమలలో తనూజ బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన దివ్వెల మాధురి – కేసు నమోదు చేసిన పోలీసులు
మార్చి 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



