Bigg Boss | హీరోగా తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ – డైరెక్టర్‌గా ప్రభాస్ ఈశ్వర్ యాక్టర్ – “సాV3” టీజర్ రిలీజ్
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న డీమోన్ పవన్ హీరోగా మారాడు. సాV3 పేరుతో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్సర్ లిఖిత హీరోయిన్‌గా నటించింది. సాV3 త్వరలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Aug 17, 2026, 2.22 pm IST
Bigg Boss | తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు డీమోన్ పవన్. ఈ సీజన్‌లో ఫైనల్ వరకు వెళ్లిన డీమోన్ పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో హీరోగా మారాడు. సాV3 పేరుతో ఓ సినిమా చేశాడు. ఈ సినిమాలో రాను బొంబాయికి రాను సాంగ్‌లో డ్యాన్సర్‌గా కనిపించిన లిఖిత హీరోయిన్‌గా నటిస్తోంది. సామ్రాట్ ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రభాస్ ఈశ్వర్‌లో నటుడిగా కనిపించిన కృష్ణ మాయ సాV3కి దర్శకత్వం వహిస్తున్నాడు.
షూటింగ్ కంప్లీట్...
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన సాV3 మూవీ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో డీమోన్ పవన్, రీతూ చౌదరి, రాము రాథోడ్‌తో పాటు పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.
లవ్‌లో కష్టాలు...
నటి రీతు చౌదరి మాట్లాడుతూ - "టీజర్ లో లవ్ అండ్ లైఫ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. నా దృష్టిలో లైఫ్ లో ఎలా కష్టాలు ఉంటాయో లవ్ లో కూడా అలాగే ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తేనే హ్యాపీగా ఉంటాం. హీరోగా సాV3 తో పవన్‌కు మంచి పేరుతో పాటు పెద్ద సక్సెస్ దక్కాలి" అని చెప్పింది.
పోటాపోటీగా...
సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్ మాట్లాడుతూ - "సాV3" సినిమా టీజర్ బాగుంది. లిఖిత, డీమోన్ పవన్ తమ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.పోటాపోటీగా నటించారు" అని అన్నారు. డైరెక్టర్ కృష్ణమాయ వల్లే సాV3 లో హీరోగా నటించే ఛాన్స్ దక్కిందని, ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేసే ఒక మంచి మూవీ ఇదని డీమోన్ పవన్ పేర్కొన్నారు. "సాV3" కథ వింటున్నప్పుడే ఎలాగైనా ఈ సినిమాలో నటించాలి అనేంత ఇష్టం ఏర్పడింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఫోక్ సాంగ్స్‌తో ఎలాగైతే పేరు వచ్చిందో అంతకుమించి ఈ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు వస్తుందనే నమ్మకముంది" అని హీరోయిన్ లిఖిత తెలిపింది.
రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం...
డైరెక్టర్ కృష్ణమాయ మాట్లాడుతూ - "సినిమాను ఎలా డైరెక్ట్ చేయాలన్నది రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం దగ్గర వర్క్ చేసినప్పుడు నేర్చుకున్నా. సాV3 సినిమా చేయడానికి వీరిద్దరే స్ఫూర్తినిచ్చారు. లిఖిత నటన సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. పవన్ గొప్ప పర్ ఫార్మర్. సాV3 పూర్తి కాకుండానే అతడితో మరో సినిమా కమిటయ్యాను. భవిష్యత్తులో చాలా బిజీ యాక్టర్ అవుతాడు" అని చెప్పాడు.
సంబంధిత వార్తలు

Bandla Ganesh Daughter Wedding | ఘనంగా బండ్ల గణేష్ కూతురు వివాహం – టాలీవుడ్ స్టార్స్ సందడి
ఆగస్టు 16, 2026

Anupama Parameswaran | టాలీవుడ్ హీరోల్లో అతడే నా క్లోజ్‌ఫ్రెండ్ – అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్
ఆగస్టు 16, 2026

Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ – సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి
- ●Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్
- ●Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్
- ●MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ
- ●Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్

Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి

Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్

Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్

MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ



