త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | రెమ్యూన‌రేష‌న్లు లేకుండా సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోలు

టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూన‌రేష‌న్ల‌పై గ‌త కొంత‌కాలంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్నాయి. సినిమాల బ‌డ్జెట్‌ల‌లో స‌గానికిపైగా రెమ్యూన‌రేష‌న్ల‌కే ఖ‌ర్చు చేయాల్సివ‌స్తుంద‌నే వాద‌న పెరుగుతోంది. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో స్టార్ హీరోలు రెమ్యూన‌రేష‌న్లు లేకుండా సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

N

Entertainment | Published On Dec 11, 2025, 11.23 am IST

Tollywood | రెమ్యూన‌రేష‌న్లు లేకుండా  సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోలు

రవితేజ

Advertisement

Tollywood | ప్ర‌స్తుతం స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం వంద‌ల కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్లు (Remuneration) తీసుకుంటున్నారు. సినిమా బ‌డ్జెట్‌లో స‌గానికిపైగా రెమ్యూన‌రేష‌న్ల కోస‌మే నిర్మాత‌లు ఖ‌ర్చు చేయాల్సివ‌స్తుంది. ప్ర‌భాస్‌(Prabhas), రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల రెమ్యూన‌రేష‌న్లు వంద కోట్ల‌కుపైనే ఉన్నాయి. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌తో టాలీవుడ్ హీరోల‌కు డిమాండ్ పెరిగింది. తెలుగులోనే కాకుండా త‌మిళం, బాలీవుడ్‌తో పాటు ఇత‌ర భాష‌ల్లో తెలుగు హీరోల సినిమాలు భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నాయి. పాన్ ఇండియ‌న్ ట్రెండ్‌తో రెమ్యూన‌రేష‌న్ల విష‌యంలో హీరోలు నో కాంప్ర‌మైజ్ అని అంటున్నారు. స్టార్ హీరోల‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాత‌లు కూడా వారు అడిగిన దానికంటే ఎక్కువే రెమ్యూన‌రేష‌న్లు ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు.
రానురాను సినిమాల బ‌డ్జెట్‌లు పెర‌గ‌డం, ఆశించిన స్థాయిలో విజ‌యాలు లేక‌పోవ‌డంతో నిర్మాత‌ల‌పై భారం పెరుగుతోంది. హీరోలు రెమ్యూన‌రేష‌న్లు త‌గ్గించుకుంటే మంచిద‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కొంద‌రు హీరోలు రెమ్యూన‌రేష‌న్లు లేకుండా సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నారు. పారితోషికాల‌ బ‌దులు లాభాల్లో వాటా, సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ తీసుకుంటూ సినిమాల‌ను అంగీక‌రిస్తున్నారు. త‌మ‌కు ఇవ్వాల్సిన రెమ్యూన‌రేష‌న్‌ను సినిమా మేకింగ్ కోస‌మే ఖ‌ర్చు పెట్ట‌మంటూ నిర్మాత‌ల‌కు చెబుతున్నారు.

ఆంధ్ర కింగ్ తాలూకా కోసం...
ఇటీవ‌ల ఆంధ్ర‌ కింగ్ తాలూకాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు రామ్ పోతినేని(Ram pothineni). మ‌హేష్ బాబు పి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను రెమ్యూన‌రేష‌న్ లేకుండానే చేశాడు రామ్‌. పారితోషికం స్థానంలో నైజాంతో పాటు గుంటూరు ఏరియా థియేట్రిక‌ల్ హ‌క్కులు తీసుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్‌గా అంత‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో రామ్‌కు ఈ సినిమా నుంచి ఐదు కోట్ల లోపే వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. డ‌బుల్ ఇస్మార్ట్ మూవీని కూడా లాభాల్లో వాటా ప‌ద్ద‌తిలోనే చేశాడు రామ్‌.
వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో ర‌వితేజ కూడా త‌న రూట్ మార్చేశాడు. ప్ర‌స్తుతం శివ నిర్వాణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ర‌వితేజ రెమ్యూన‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట‌. సినిమా హిట్ట‌యి ప్రాఫిట్స్ వ‌స్తే అందులో నుంచి ప‌ర్సంటేజ్ తీసుకునే విధానంలో సినిమాలో న‌టిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

థియేట్రిక‌ల్ హ‌క్కులు
ప్ర‌భాస్ కూడా స్పిరిట్ సినిమా కోసం రెమ్యూన‌రేష‌న్ బ‌దులుగా తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ హ‌క్కులు తీసుకునే ఒప్పందం మీద అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. రెమ్యూన‌రేష‌న్‌తో పోలిస్తే ఈ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా ప్ర‌భాస్‌కు భారీగానే గిట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
హీరోలే కాదు హీరోయిన్లు కూడా రెమ్యూన‌రేష‌న్లు లేకుండా సినిమాలు చేయ‌డానికి రెడీ అంటున్నారు.
ఇటీవ‌ల విడుద‌లైన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీ రిలీజ్ కు ముందు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ర‌ష్మిక‌. సినిమా ద్వారా వ‌చ్చిన‌ లాభాల్లో నుంచే కొంత ప‌ర్సంటేజ్ ఆమెకు పారితోషికంగా చెల్లించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement