Virosh Reception | ప్రభాస్, ఎన్టీఆర్, సమంత… విజయ్, రష్మిక రిసెప్షన్‌లో కనిపించని టాలీవుడ్ స్టార్స్ వీళ్లే
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి, నాగార్జున పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు. అయితే ఈ రిసెప్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ప్రభాస్‌తో పాటు మరికొంతమంది టాలీవుడ్ హీరోలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Entertainment | Published On Mar 5, 2026, 5.18 pm IST
Virosh Reception | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మార్చి 4న విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ వివాహ విందుకు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్‌తో జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కేటీఆర్, హరీష్‌రావు, డీకే శివకుమార్‌తో పాటు పలువురు పొలిటికల్ లీడర్స్ వివాహ విందుకు హాజరై విరోష్ జంటను ఆశీర్వదించారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్, నాని, రవితేజ, సుకుమార్, నాగ్ అశ్విన్, కార్తీ సహా చాలా మంది హీరోలు, డైరెక్టర్లు రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
ప్రభాస్ మిస్సింగ్...
కొందరు స్టార్ హీరోలు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరుకాకపోవడంతో ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, రామ్ పోతినేనితో పాటు మరి కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కల్కిలో గెస్ట్ రోల్...
ప్రభాస్ హీరోగా నటించిన కల్కిలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేశాడు. ప్రభాస్ పట్ల తనకున్న అభిమానాన్ని చాలా సార్లు చాటుకున్నాడు. అయినా విజయ్ రిసెప్షన్‌ను ప్రభాస్ స్కిప్ చేయడం నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్‌లోనే ఉండి ఈ రిసెప్షన్‌కు అటెండ్ కాలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత...
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి మూవీలో సమంత హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అయినా సామ్ మాత్రం విజయ్, రష్మిక వివాహ వేడుకను మిస్ చేసింది.
మహేష్‌బాబు ప్రస్తుతం వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. జోర్డాన్‌లో షూటింగ్ జరగడంతో మహేష్‌బాబు విజయ్ రిసెప్షన్‌కు రాలేకపోయారు. మహేష్ బదులుగా అతడి భార్య నమ్రతతో పాటు కూతురు సితార ఈ వేడుకలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాత్రమే కాకుండా సీనియర్ హీరో బాలకృష్ణతో పాటు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఒక్కరూ కూడాఈ పెళ్లి విందులో పాల్గొనలేదు. చిరంజీవి, రామ్‌చరణ్ మినహా మిగిలిన మెగా యంగ్ హీరోలు వేడుకకు రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Trp Rating | బుల్లితెరపై కూడా డిజాస్టర్ – ఎన్టీఆర్ వార్ 2కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్ – మరీ అంత తక్కువా!
మే 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



