త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Saab OTT | ఓటీటీలోకి ప్ర‌భాస్ రాజాసాబ్ – నెల రోజులు కాక‌ముందే స్ట్రీమింగ్

సంక్రాంతికి థియేట‌ర్ల‌లో రిలీజైన ప్ర‌భాస్ రాజాసాబ్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ హార‌ర్ కామెడీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైన‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On Jan 28, 2026, 7.18 pm IST

Raja Saab OTT | ఓటీటీలోకి ప్ర‌భాస్ రాజాసాబ్ – నెల రోజులు కాక‌ముందే స్ట్రీమింగ్
Advertisement

Raja Saab OTT |  ప్ర‌భాస్ రాజాసాబ్ సంక్రాంతికి థియేట‌ర్ల‌లో రిలీజైంది. హార‌ర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రిలీజ్‌కు ముందు సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ కోస‌మే అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. బ‌డ్జెట్‌, హైప్‌తో పాటు అన్నింటిలో రాజ్‌సాబ్ ముందు నిలుస్తూ వ‌చ్చింది. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా రాజాసాబ్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. రీసెంట్ టైమ్‌లో ప్ర‌భాస్ కెరీర్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

80 కోట్ల‌కు...

తాజాగా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే రాజాసాబ్ ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజాసాబ్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే జియో హాట్‌స్టార్ ద‌క్కించుకుంది. దాదాపు ఎన‌భై కోట్ల‌కు హ‌క్కులు అమ్ముడుపోయిన‌ట్లు వార్త‌లొచ్చాయి.
కాగా రాజాసాబ్ మూవీ ఫిబ్ర‌వ‌రి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు మ‌రో నాలుగు భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న‌ట్లు చెబుతున్నారు. తొలుత ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఆరు వారాల త‌ర్వాత ఓటీటీలోకి తీసుకురావాల‌ని అనుకున్నార‌ట‌. కానీ డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్‌తో మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు నాలుగు వంద‌ల యాభై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు 206 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. నిర్మాత‌కు ఈ సినిమా వంద కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను మిగిల్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజాసాబ్ మూవీకి సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్ట్ 2కు ది రాజాసాబ్ స‌ర్క‌స్ 1935 అనే టైటిల్ ఖ‌రారు చేశారు. పార్ట్ వ‌న్ డిజాస్ట‌ర్‌తో ఈ సీక్వెల్ తెర‌కెక్కించ‌డం డౌట్‌గా మారింది.
రాజాసాబ్ మూవీలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ది కుమార్ హీరోయిన్లుగా న‌టించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

రాజాసాబ్ క‌థ ఇదే...

దేవ‌న‌గ‌ర సంస్థాన జ‌మీందారిణి గంగాదేవి ఆస్తుల‌న్నీ వ‌దిలేసి మ‌న‌వ‌డు రాజాసాబ్‌తో సాధార‌ణ జీవితం గ‌డుపుతుంటుంది. భ‌ర్త క‌న‌క‌రాజును వెతికి తీసుకుర‌మ్మ‌ని మ‌న‌వ‌డు రాజాసాబ్‌ను కోరుతుంది గంగాదేవి. క‌న‌క‌రాజు కోసం అడ‌విలో ఉన్న ఓ రాజ‌మ‌హ‌ల్‌కు వ‌స్తాడు రాజాసాబ్‌. అక్క‌డ అత‌డికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? రాజాసాబ్ లైఫ్‌లోకి వ‌చ్చిన భైర‌వి (మాళ‌వికా మోహ‌న‌న్‌), బ్లెస్సీ (నిధి అగ‌ర్వాల్‌)తో పాటు అనిత ( రిద్ది కుమార్‌) ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement