Prabhas Raja Saab | ప్రభాస్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ – వేదిక ఎక్కడంటే?
Prabhas Raja Saab | ప్రభాస్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌తో పాటు వేదిక ఫిక్సయ్యింది. డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగనున్నట్లు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ అభిమానుల ముందుకు రాబోతున్నారు.
Entertainment | Published On Dec 17, 2025, 6.56 pm IST
ప్రభాస్
Prabhas Raja Saab | ప్రభాస్ (Prabhas) రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌కు మరో నెల రోజుల కంటే తక్కువే టైమ్ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడు పెంచేశారు. బుధవారం సహానా సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో వైరల్‌గా మారింది.
రాజాసాబ్‌కు సంబంధించి ఇప్పటివరకు చాలానే ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు మేకర్స్. డైరెక్టర్ మారుతితో పాటు హీరోయిన్లు ఈ వేడుకల్లో సందడి చేశారు. ప్రభాస్ మాత్రం ఒక్క ఈవెంట్‌కు కూడా అటెండ్ కాలేదు. ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో (Pre Release Event) ప్రభాస్ రాజాసాబ్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నాడట. ఈ ఈవెంట్ డేట్‌తో పాటు వేదికను కూడా మేకర్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం. డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీ స్థాయిలో రాజాసాబ్ ప్రీ రిలీజ్ వేడుక జరుగనున్నట్లు తెలిసింది. ఈ ప్రీ రిలీజ్‌కు ప్రభాస్‌తో పాటు రాజాసాబ్ టీమ్ మొత్తం అటెండ్ కానున్నారట. టాలీవుడ్‌కు చెందిన కొందరు టాప్ డైరెక్టర్లు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ మీడియా ముందుకొచ్చి చాలా రోజులు అవుతుంది. బాహుబలి ఎపిక్ టైమ్‌లో ఫ్యాన్స్‌ను ప్రభాస్ కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ రాజాసాబ్ షూటింగ్‌తో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల వల్ల కుదరలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత రాజాసాబ్ ద్వారా అభిమానులకు దర్శనమివ్వబోతున్నాడు ప్రభాస్. ఈ ప్రీ రిలీజ్‌లో ప్రభాస్ ఏం మాట్లాడుతాడన్నది ఉత్కంఠను పంచుతోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మొదలుపెట్టి దాదాపు పది రోజుల పాటు రాజాసాబ్ ప్రమోషన్స్ కోసంప్రభాస్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. హైదరాబాద్ తర్వాత చెన్నై, ముంబాయితో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో జరిగే వేడుకల్లో ప్రభాస్ పాల్గొననున్నట్లు చెబుతున్నారు.
రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ హారర్ కామెడీ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాజాసాబ్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట. దాదాపు మూడు గంటల పది నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజాసాబ్‌తో పాటు స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. వీటి తర్వాత కల్కి 2, సలార్ 2 సినిమాలు చేయనున్నాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






