త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ప్ర‌భాస్ రాజాసాబ్ ఓటీటీ క‌ష్టాల‌కు చెక్ – రికార్డ్ ధ‌ర‌కు డీల్ క్లోజ్‌

N

Entertainment | Published On Dec 5, 2025, 4.08 pm IST

ప్ర‌భాస్ రాజాసాబ్ ఓటీటీ క‌ష్టాల‌కు చెక్ – రికార్డ్ ధ‌ర‌కు డీల్ క్లోజ్‌

ప్రభాస్ రాజాసాబ్

Advertisement

రాజాసాబ్ మూవీతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌. హార‌ర్ కామెడీ క‌థాంశంతో రూపొందిన ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాజాసాబ్ రిలీజ్‌కు మ‌రో నెల రోజులే టైమ్ ఉండ‌గా...ఇన్నాళ్లు ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోక‌పోవ‌డంతో అభిమానుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. అఖండ 2 మాదిరిగానే చివ‌రి నిమిషంలో ప్ర‌భాస్ మూవీ పోస్ట్‌పోన్ అయ్యే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రిగింది.
ముంబాయికి చెందిన ఓ ఫైనాన్స్ సంస్థ‌తో నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌కు ఆర్థిక విభేదాల కార‌ణంగానే రాజాసాబ్ ఓటీటీ డీల్ డిలే అవుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌చ్చింది. రాజాసాబ్ ఓటీటీ డీల్ ముగిసింది. దాదాపు 140 కోట్ల‌కు రాజాసాబ్ ఓటీటీ హ‌క్కుల‌ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల్లో క‌లిపి భారీ మొత్తాన్ని చెల్లించి జీయో హాట్‌స్టార్ డిజిట‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌భాస్ కెరీర్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయిన మూవీగా రాజాసాబ్ రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్లు స‌మాచారం.
రాజాసాబ్ మూవీలో మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ హార‌ర్ కామెడీ సినిమా ప్ర‌భాస్ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు.
తొలుత రాజాసాబ్‌ను డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మూవీ కావ‌డంతో రిక‌వ‌రీ ప‌రంగా సంక్రాంతి అయితేనే సేఫ్ అని భావించి పండుగ‌కు షిప్ట్ చేశారు. జ‌న‌వ‌రి 9న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
ఇటీవ‌లే ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌తో పాటు రెబెల్ సాబ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ బాగున్నా ఫ‌స్ట్ సింగిల్‌కు మాత్రం ఆశించిన స్థాయిలో స్పంద‌న రాలేదు. ఓటీటీ డీల్ క్లోజ్ కావ‌డంతో సెకండ్ సింగిల్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
ప్ర‌స్తుతం రాజాసాబ్‌తో పాటు ఫౌజీ, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్ర‌భాస్‌. క‌ల్కి 2, స‌లార్ 2తో పాటు కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్‌తో ఓ మూవీ క‌మిట‌య్యాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement