త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Saab Trailer | జోక‌ర్ గెట‌ప్‌లో ప్ర‌భాస్ – రెబెల్ స్టార్ టైమ్ స్టార్ట్ – రాజాసాబ్ కొత్త ట్రైల‌ర్ అదుర్స్‌

ప్ర‌భాస్ రాజాసాబ్ కొత్త ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. యాక్ష‌న్‌, హార‌ర్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ ట్రైల‌ర్ చివ‌ర‌లో ప్ర‌భాస్ జోక‌ర్ గెట‌ప్‌లో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశారు.

N

Entertainment | Published On Dec 29, 2025, 4.18 pm IST

Raja Saab Trailer | జోక‌ర్ గెట‌ప్‌లో ప్ర‌భాస్ – రెబెల్ స్టార్ టైమ్ స్టార్ట్ – రాజాసాబ్ కొత్త ట్రైల‌ర్ అదుర్స్‌
Advertisement

Raja Saab Trailer |  ప్ర‌భాస్ రాజాసాబ్ నుంచి కొత్త ట్రైల‌ర్ వ‌చ్చేసింది. రాజాసాబ్ 2. 0 పేరుతో రిలీజ్ చేసిన ఈ ట్రైల‌ర్‌ యాక్ష‌న్‌, కామెడీ, హార‌ర్ , రొమాంటిక్ అంశాల‌తో రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ఫీస్ట్‌లా నిలిచింది. ఇందులో ప్ర‌భాస్ డిఫ‌రెంట్ షేడ్స్‌, లుక్‌ల‌లో క‌నిపించారు. "ప్ర‌పంచంలో నీకు అన్ని మ‌ర్చిపోయే రోగం ఉన్న ఆయ‌న్ని మాత్రం అస్స‌లు మ‌ర్చిపోలేవు" అని ప్ర‌భాస్ అన‌గానే సంజ‌య్ ద‌త్ ఫొటో క‌నిపించే సీన్‌తోనే ఈ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. "మ‌న టైమ్ స్టార్ట‌య్యింది ల‌వ్ యూ" అని ప్ర‌భాస్ డైలాగ్ చెప్ప‌డం... అలాగే రాజ‌సాబ్ జ‌రీనా వ‌హాబ్ బ‌దులివ్వ‌డం ఆక‌ట్టుకుంది. నాన‌మ్మ , మ‌న‌వ‌డి ఎమోష‌న్‌తో ట్రైల‌ర్‌ను మొద‌లుపెట్టి హార‌ర్ లోకి ట‌ర్న్ తీసుకున్నారు డైరెక్ట‌ర్‌ మారుతి. "ఒరేయ్ క‌న‌క‌రాజు నాకు నీ గురించి తెలుసుకోవాల‌ని ఉంది చాలా మిస్సింగ్ "..... "ఈ ఇల్లు ఒక మ‌య‌స‌భ. ఇక్క‌డ‌కు రావ‌డ‌మే కానీ వెళ్లాలంటే మీ సంత‌కం కావాలి" లాంటి డైలాగ్స్‌తో ట్రైల‌ర్ ఆస‌క్తిని పంచింది. సాధార‌ణ గంగ‌మ్మ‌ కాదు..గంగాదేవి... దేవ‌న‌న‌గ‌ర సంస్థాన‌ జ‌మీందారిణి గంగాదేవి అంటూ జ‌రీనా వ‌హాబ్ పాత్ర గురించి ఇచ్చిన ఎలివేష‌న్లు, ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌పై వ‌చ్చిన భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. అయితే ఏందిరా ఇప్పుడు... చివ‌ర‌లో మాస్ డైలాగ్‌తో హాలీవుడ్ విల‌న్ జోక‌ర్ గెట‌ప్‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంది.

క‌థ ఇదేనా...

రాజాసాబ్ 2.0 ట్రైల‌ర్‌లో ఈ సినిమా క‌థేమిటో చెప్పేశారు మేక‌ర్స్‌. నాన‌మ్మ ఓ సంస్థానానికి అధిప‌తి. తాత మాత్రం ఓ తాంత్రికుడు. నాన‌మ్మ కు చెందిన ఓ పాత మ‌హాల్ లోకి రాజాసాబ్ అడుగుపెట్ట‌డం? ఆ మాయ‌ప్ర‌పంచంలో అత‌డికి ఎదుర‌య్యే అనుభ‌వాల‌తో ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ ద్వారా క‌థ చెప్పేశారు. ప్ర‌భాస్ వ‌ర్సెస్ సంజ‌య్ ద‌త్ పోరాటం చుట్టూ కథ నడవనున్నట్లు కనిపిస్తోంది.

గ్రాండియ‌ర్ విజువ‌ల్స్‌...

గ్రాండియ‌ర్ విజువ‌ల్స్‌, అదిరిపోయే బీజీఎమ్‌తో ఈ సెకండ్ ట్రైల‌ర్ అభిమానుల‌ను మెప్పిస్తోంది.హీరోయిన్ల‌ను మాత్రం ఈ ట్రైల‌ర్‌లో చూపించ‌లేదు. గ‌తంలో రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ విష‌యంలో మారుతిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటికి ఈ కొత్త టీజ‌ర్‌లో బ‌దులిచ్చారు. హార‌ర్ కామెడీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ జ‌న‌వ‌రి 9న సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
రాజాసాబ్‌లో ప్ర‌భాస్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ది కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో టీజీ విశ్వ‌ప్ర‌సాద్ రాజాసాబ్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement