Cinema Ticket Price | రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారుకు తెలంగాణలో టికెట్ ధరలు ఎంత పెరగనున్నాయంటే?
టికెట్ ధరలతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు కోరుతూ రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు మేకర్స్ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. రాజాసాబ్ ప్రీమియర్ షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో 900, మల్టీప్లెక్స్‌లలో 1000 వరకు టికెట్ ధరలు ఉండేలా జీవో జారీ చేయమని కోరినట్లు సమాచారం.
Entertainment | Published On Jan 6, 2026, 7.55 pm IST
Cinema Ticket Price |ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఐదు తెలుగు సినిమాలతో పాటు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు నిలిచాయి. ఈ ఏడు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు సినిమాలన్నీ కామెడీ కథాంశాలతోనే తెరకెక్కాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు రిలీజ్ కానున్నాయి.
బడ్జెట్ కారణంగా...
ఈ ఐదు సంక్రాంతి సినిమాల్లో ప్రభాస్ రాజాసాబ్‌తో పాటు చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు సినిమాల టికెట్ ధరలు పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజాసాబ్ మూవీ నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. చిరంజీవి మన శంకర వర ప్రసాద్‌గారు కోసం 200 కోట్ల వరకు మేకర్స్ వెచ్చించినట్లు సమాచారం. బడ్జెట్ దృష్ట్యా టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షో అనుమతుల కోసం మేకర్స్ తెలంగాణ,ఏపీ ప్రభుత్వాలను సంప్రదించినట్లు తెలిసింది.
ఏపీలో టికెట్ ధరలతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు రావడం దాదాపు ఖాయమైంది. తెలంగాణలో మాత్రం ఇంకా టికెట్ ధరల పెంపుపై క్లారిటీ రాలేదు. ధరల పెంపు తో పాటు బెనిఫిట్ షోలకోసం ప్రభుత్వాన్ని రాజాసాబ్‌తో పాటు మన శంకర వరప్రసాద్‌గారు మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం.
వెయ్యి రూపాయలు...
రాజాసాబ్ మూవీ ప్రీమియర్ షోస్‌కు సింగిల్ స్క్రీన్స్‌లో 900, మల్టీప్లెక్స్‌లలో వెయ్యి రూపాయల వరకు ధరలు ఉండేలా తమ ధరఖాస్తులో పేర్కొన్నట్లు సమాచారం. జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్స్‌లో 944, మల్టీప్లెక్స్‌లలో 1180 వరకు టికెట్ ధరలు ఉంటాయి. జనవరి 8 రోజు ప్రీమియర్‌తో పాటు జనవరి 9న ఉదయం 6 గంటల స్పెషల్‌కు ప్రదర్శించేందుకు అనుమతులు ఇవ్వాలని రాజాసాబ్ మేకర్స్ కోరారు.
టికెట్ ధరలను జనవరి 9 నుంచి జనవరి 18 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో 105, మల్టీప్లెక్స్‌లో 132 రూపాయలు పెంచాలని అడిగినట్లు సమాచారం.
ఆరు వందలు...
మన శంకర వరప్రసాద్ మేకర్స్ జనవరి 11న ప్రీమియర్ షోకు 600 టికెట్ ధరలు ఉండేలా చూడమని రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. జనవరి 11 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో యాభై, మల్టీప్లెక్స్‌లో వంద రూపాయల ధరలు పెంచుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు సంబంధించిన అనుమతులు మరో ఒకటి రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



