Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? – రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
రాజాసాబ్ తర్వాత ఈ ఏడాది ప్రభాస్ మరో మూవీ థియేటర్లలోకి రాబోతుందట. ఫౌజీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. హిస్టారికల్ యాక్షన్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 3న విడుదలకానుందట. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Jun 28, 2026, 6.13 pm IST
Prabhas | ఈ ఏడాది రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్. హారర్ కామెడీగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండా పలు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తోన్నారు ప్రభాస్.కాగా రాజాసాబ్ తర్వాత 2026లో ప్రభాస్ మరో మూవీ థియేటర్లలోకి రానుందట. ఫౌజీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఫౌజీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించబోతున్నారట.
1945 బ్యాక్‌డ్రాప్‌లో...
హిస్టారికల్ యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఫౌజీ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 1945 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటీషర్ల వద్ద పనిచేసే సైనికుడిగా కనిపించనున్నారట. మాతృభూమి కోసం బ్రిటీషర్లను ఎదురించి పోరాడే యోధుడిగా పవర్‌ఫుల్‌గా ప్రభాస్ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారం. పురాణాల్లోని అర్జున్డుడు, కర్ణుడు పాత్రల ఆధారంగా రెబెల్ స్టార్ క్యారెక్టర్‌ను హను రాఘవపూడి డిజైన్ చేశారట. ఆయన లుక్, యాక్టింగ్ కొత్తగా ఉంటాయని అంటున్నారు.
ఇమాన్వీ...
ఫౌజీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తితో పాటు జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫౌజీ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. కొంత టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలిసింది.
నాలుగు వందల కోట్ల బడ్జెట్...
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఫౌజీ సినిమాను నిర్మిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫౌజీకి ప్రీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల హను రాఘవపూడి ప్రకటించారు.
మూడు సినిమాలు...
ప్రస్తుతం ఫౌజీతో పాటు సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా చేస్తోన్నారు ప్రభాస్. హై ఇంటెన్స్ యాక్షన్‌గా రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతుంది. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాతో పాటు కల్కి 2తో ప్రభాస్ బిజీగా ఉన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం – ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
జూన్ 28, 2026

Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ – నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
జూన్ 28, 2026

Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్
- ●Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
- ●Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు
- ●Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?
- ●Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. పచ్చకామెర్లు వచ్చినోళ్ల లెక్కనే ఉన్నరు

Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్

Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు

Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?



