Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే – కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. కల్కి 2 షూటింగ్‌తో పాటు సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడన్నది మేకర్స్ రివీల్ చేశారు. అక్టోబర్ నుంచి కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. వచ్చే నెల నుంచే ప్రభాస్ కూడా చిత్రీకరణలో భాగం కానున్నట్లు వెల్లడించారు.
Entertainment | Published On Sep 25, 2026, 6.50 pm IST
Kalki 2 | పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో ఈ సినిమా రెండు పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్ పాపులర్ మూవీగానే కాకుండా ప్రొడక్ష్‌న్ డిజైన్‌లో జాతీయ అవార్డులు వచ్చాయి.
కమల్‌హాసన్ విలన్...
సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విలక్షణ నటుడు కమల్‌హాసన్ విలన్‌గా నటించగా...అమితాబ్‌బచ్చన్, దీపికా పడుకోణ్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి మూవీకి సీక్వెల్ రాబోతుంది. కల్కి 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్ వినిపించారు. కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడన్నది రివీల్ చేశారు.
ప్రభాస్ ఎంట్రీ...
అక్టోబర్ నుంచి కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్‌తో పాటు ప్రధాన తారగణం మొత్తం చిత్రీకరణలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. సీక్వెల్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. పార్ట్ వన్‌తో పోలిస్తే మరింత గ్రాండియర్‌గా కల్కి 2ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. స్కేల్, విజువల్స్, యాక్షన్ సీన్లు అన్ని నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని తెలిపారు.
సాయిపల్లవి....
అక్టోబర్ నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపనున్నారు. నటీనటుల డేట్స్‌కు తగ్గట్లుగా భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. నిర్మాతలతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకుంది. ఆమె స్థానంలో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచి కల్కి 2 షూటింగ్‌లో సాయిపల్లవి కూడా జాయిన్ కానున్నట్లు చెబుతోన్నారు. చిత్రీకరణ పూర్తి కావడానికి డెడ్‌లైన్ కూడా ఫిక్స్ చేశారు. 2027 జూలైలోగా షూటింగ్‌ను పూర్తిచేయబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చివరలో లేదంటే 2028 ఆరంభంలో సినిమాను కల్కి 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా నేషనల్ క్రష్
సెప్టెంబర్ 24, 2026

Nani The Paradise movie | నాని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ కోరిక.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఏమన్నారంటే?
సెప్టెంబర్ 23, 2026

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ – సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
- ●Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..
- ●Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
- ●హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?
- ●Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
- ●Gujarat Handicrafts | శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా

Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..

Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..

Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా

హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?



