Prabhas Fauzi | ప్రభాస్ బర్త్‌డేకు ‘ఫౌజీ’ డబుల్ ధమాకా – ఇమాన్వీ ఫస్ట్ లుక్‌పై అప్పుడే క్లారిటీ?
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫౌజీ టీమ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 23 ఫౌజీ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ టీజర్ కంటే మూడు రోజుల ముందు ఇమాన్వీ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Entertainment | Published On Oct 9, 2026, 4.26 pm IST
Prabhas Fauzi | ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఫౌజీ. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫౌజీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అదిరిపోయే ట్రీట్...
ఇటీవలే ఫౌజీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో దర్శకనిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తప్పితే ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంపై ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో అక్టోబర్ 23న టీజర్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో షూటింగ్...
ప్రభాస్ డబ్బింగ్ మినహా ఈ టీజర్‌కు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్, మిథున్ చక్రవర్తి, ఇమాన్వీతో పాటు ప్రధాన తారాగణంపై ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి షూట్ చేస్తున్నారు. ఈ వారంలోనే ఈ ఎపిసోడ్ కంప్లీట్ కానున్నట్లు సమాచారం. నెక్స్ట్ షెడ్యూల్ నవంబర్ 15 నుంచి మొదలుకానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇమాన్వీ ఫస్ట్ లుక్...
టీజర్ రిలీజ్‌కు మూడు రోజుల ముందు హీరోయిన్ ఇమాన్వీ ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 20న ఇమాన్వీ బర్త్‌డే ఉంది. అదే రోజు ఫౌజీలోఆమె లుక్‌తో పాటు హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుందన్నది మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా రిలీజ్ కోసం ఇమాన్వీ గత రెండేళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె ఎదురుచూపులకు అక్టోబర్ 20తో పుల్‌స్టాప్ పడనున్నట్లు సమాచారం.
స్పిరిట్ స్థానంలో...
మరోవైపు ఫౌజీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురాలని అనుకున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల డిలే వల్ల వాయిదా వేస్తున్నట్లు ఇటీవల నిర్మాత ప్రకటించారు. డిసెంబర్‌లో కాకుండా మార్చిలో ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. స్పిరిట్ డేట్‌కు ఫౌజీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. స్పిరిట్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vinay Kumar | పాలపిట్టలు పంజరాల్లో.. సింథటిక్ మాంజాలు షాపుల్లో ఉండొద్దు
- ●Supreme Court | ఢిల్లీలో ప్రజా రవాణాకు అనుమతించండి.. మెట్రో స్టేషన్లు మూసివేయాలన్న నిర్ణయంపై సుప్రీం అభ్యంతరం
- ●Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?
- ●Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం
- ●Balmoor Venkat | వీక్లీ సీరియల్లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Vinay Kumar | పాలపిట్టలు పంజరాల్లో.. సింథటిక్ మాంజాలు షాపుల్లో ఉండొద్దు

Supreme Court | ఢిల్లీలో ప్రజా రవాణాకు అనుమతించండి.. మెట్రో స్టేషన్లు మూసివేయాలన్న నిర్ణయంపై సుప్రీం అభ్యంతరం

Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?

Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం






