త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas | ఏడేళ్ల త‌ర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్ర‌భాస్ – ఇన్నాళ్లు బాహుబ‌లి … ఇక‌పై ఫౌజీ

ఏడేళ్ల త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్ డీపీని మార్చాడు హీరో ప్ర‌భాస్‌. ఇన్నాళ్లు బాహుబ‌లి మూవీని స్టిల్‌ను డీపీగా కొన‌సాగిస్తూ వ‌చ్చారు ప్ర‌భాస్‌. బాహుబ‌లి పోస్ట‌ర్ తీసేసిన ప్ర‌భాస్‌ దాని ప్లేస్‌లో ఫౌజీ స్టిల్‌ను త‌న ఇన్‌స్టా డీపీగా పెట్ట‌డంపై ఫ్యాన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇండిపెండెన్స్ డే రోజు ఫౌజీ నుంచి స్పెష‌ల్ అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Aug 14, 2026, 4.45 pm IST

Prabhas |  ఏడేళ్ల త‌ర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్ర‌భాస్ – ఇన్నాళ్లు బాహుబ‌లి … ఇక‌పై ఫౌజీ
Advertisement

Prabhas |  రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియ‌న్ల‌కుపైనే ఫాలోవ‌ర్స్ ఉన్నారు. త‌న కొత్త సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ త‌ప్పితే సోష‌ల్ మీడియాలో వ్య‌క్తిగ‌త పోస్ట్‌లు పెద్ద‌గా పెట్ట‌రు. ఇన్నాళ్లు ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ ఫొటోగా బాహుబ‌లి స్టిల్‌ఉండేది. గ‌త ఏడేళ్లుగా ఇదే డీపీని కొన‌సాగిస్తూ వ‌చ్చారు. బాహుబ‌లి త‌ర్వాత చాలానే సినిమాలు చేసినా ఏ ఫొటోను కూడా డీపీగా పెట్టుకోలేదు. ఏడేళ్ల త‌ర్వాత ఇన్‌స్టా డీపీ ఫొటో మార్చారు. బాహుబ‌లి ప్లేస్‌లో ఫౌజీ స్టిల్‌ను డీపీగా పెట్టుకున్నారు.ఇండిపెండెన్స్ డే కు ఒకరోజు ముందు ప్రభాస్ తన డీపీ మార్చడం వైరల్ గా మారింది.

అప్‌డేట్‌...

ఆగ‌స్ట్ 15న ఫౌజీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రావ‌డం ఖాయ‌మ‌ని ఈ డీపీ ద్వారా హింట్ ఇచ్చాడ‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఈ సినిమా కంటెంట్‌పై ప్ర‌భాస్‌కు గ‌ట్టి న‌మ్మ‌కం ఏర్ప‌డ‌టంతోనే మూవీ స్టిల్‌ను డీపీగా పెట్టుకున్నాడ‌ని అంటున్నారు.

ఇమాన్వీ ఇస్మాయిల్‌...

హిస్టారిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఫౌజీ మూవీకి సీతారామం ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోగా న‌టిస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం 1930 కాలం నాటి క‌థ‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. ఫౌజీలో సుభాష్ చంద్ర‌బోస్ ఆజాద్ హింజ్ ఫౌజ్‌లో ప‌నిచేసిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

డిసెంబ‌ర్‌లో...

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఫౌజీ మూవీ ఈ ఏడాది డిసెంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, చైత్ర జె. అచార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

స్పిరిట్‌...

ప్ర‌స్తుతం ఫౌజీతో పాటు క‌ల్కి 2, స్పిరిట్ సినిమాల్లో న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న స్పిరిట్ మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

 

 

Advertisement
Advertisement