త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు..?

Ramachander Rao | తెలంగాణ‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల( Graduate MLC Elections ) హ‌డావుడి కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది.

S

Telangana | Published On Oct 23, 2026, 3.41 pm IST

Ramachander Rao | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు..?
Advertisement

Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల( Graduate MLC Elections ) హ‌డావుడి కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది.

అయితే రంగారెడ్డి - మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు( Ramachander Rao ) పేరును ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. రామ‌చంద‌ర్ రావు పేరును బీజేపీ అధిష్టానం నిర్ణ‌యం చేసింద‌ని, అధికారిక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే మిగిలి ఉంద‌ని పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల చివ‌రి నాటికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల పేర్ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి హైద‌రాబాద్ - రంగారెడ్డి - మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా సామ రామ్మోహ‌న్ రెడ్డి, ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ - న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా రాంరెడ్డి స‌ర్వోత్త‌మ్ రెడ్డి పేరును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement