త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

418 Movie Review | 418 రివ్యూ – ప్ర‌శాంత్ నీల్ హార‌ర్ మూవీ భ‌య‌పెట్టిందా? లేదా?…

కేజీఎఫ్, స‌లార్ సినిమాల డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ప్రొడ్యూస‌ర్‌గా మారి మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి నిర్మించిన హార‌ర్ మూవీ 418. స్టార్లు లేకుండా కొత్త యాక్ట‌ర్ల‌తో రూపొందిన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?

N

Entertainment | Published On Oct 23, 2026, 11.48 am IST

418 Movie Review | 418 రివ్యూ –  ప్ర‌శాంత్ నీల్ హార‌ర్ మూవీ భ‌య‌పెట్టిందా?  లేదా?…
Advertisement

418 Movie Review | హార‌ర్ జాన‌ర్‌ను మినిమం గ్యారెంటీగా చెబుతుంటారు. ఎంత భ‌య‌పెడితే అంత క‌లెక్ష‌న్ల‌ను సాధించే స‌త్తా ఈ సినిమాల‌కు ఉంటుంది. అందుకే ఈ హార‌ర్ (Horror Movie)జాన‌ర్‌లో సినిమాలు చేసేందుకు స్టార్లు కూడా ఈ మ‌ధ్య ఆస‌క్తిని చూపుతున్నారు. కేజీఎఫ్‌, స‌లార్ లాంటి సినిమాల‌తో మాస్‌ను కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) కూడా హార‌ర్ జాన‌ర్‌లోకి ఎంట‌ర‌య్యారు. డైరెక్ట‌ర్‌గా కాదు...ప్రొడ్యూస‌ర్‌గా. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో ప్ర‌శాంత్ నీల్‌ 418 పేరుతో ఓ చిన్న సినిమాను నిర్మించారు. ఇందులో స్టార్లు ఎవ‌రూ లేరు. ప్ర‌శాంత్ నీల్ పేరు ఈ సినిమాకు పెద్ద బ్యాక్‌బోన్‌. హార‌ర్ సినిమాతో ప్ర‌శాంత్ నీల్ అండ్ టీమ్ భ‌య‌పెట్టారా? లేదా? అంటే?

ట్రెండీ హార‌ర్ మూవీ....

హార‌ర్ సినిమాలు చాలా వ‌ర‌కు ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. ఓ పాడుబ‌డిన బంగ‌ళాలో ద‌య్యం ఉండ‌టం...అందులోకి అనుకోని ప‌రిస్థితుల్లో హీరోహీరోయిన్లు అడుగుపెట్ట‌డం, ఆ ద‌య్యానికి ఓ గ‌తం... రివేంజ్ తీర్చుకోవ‌డానికి ఎదురుచూడ‌టం...హీరోలు మారినా ఈ టెంప్లేట్ మాత్రం మార‌దు. ఈపాయింట్‌ను ద‌ర్శ‌కులు తిప్పి తిప్పి అనేక కోణాల్లో తీసేశారు. 418 కూడా అదే బాప‌తు సినిమా. కాక‌పోతే ట్రెండీ హార‌ర్ మూవీ. ద‌య్యాలు,దేవుళ్లు లేవ‌నే యూత్ బాయ్స్ చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంది. రెగ్యుల‌ర్ హార‌ర్ సినిమాల్లో విచిత్ర‌మైన ఆకారాల‌తో భ‌య‌పెట్టే ద‌య్యాలు ఇందులో క‌నిపించ‌వు.

దేవ‌కి గ‌తం ...

అన‌గ‌న‌గా ఓ మెడిక‌ల్ కాలేజీ. సిటీకి దూరంగా ఓ అడ‌వి మ‌ధ్య‌లో ఉంటుంది. ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు హాస్ట‌ల్ స‌రిపోక‌పోవ‌డంతో ఆ కాలేజీ ప్రాంగ‌ణంలోనే చాలా ఏళ్లుగా మూత‌ప‌డి ఉన్న పాత బిల్డింగ్‌ను కాలేజీ యాజ‌మాన్యం ఓపెన్ చేస్తుంది. అందులోకి ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌హిళ‌లు రాకూడ‌దు. 418వ నంబ‌ర్ రూమ్ ఓపెన్ చేసేందుకు ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. ఈ రెండు రూల్స్ అతిక్ర‌మించ‌కుండా ఎప్పుడూ సెక్యూరిటీ కాప‌లాగా ఉంటారు.
వికాస్‌, రోహిత్‌, మ్యాగీ, డాక్ట‌ర్‌...కాలేజీలో చేరిన కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మెడిక‌ల్ కాలేజీలో ట్రీట్‌మెంట్ కోసం వ‌చ్చిన స‌యేషా వారి బ్యాచ్‌లో చేరుకుంది. 418 రూమ్‌లో ఏముందో తెలుసుకోవాల‌ని ఐదుగురు అనుకుంటారు. స‌యేషా హాస్ట‌ల్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత దేవిక అనే ఆత్మ వారిని వెంటాడ‌టం మొద‌లుపెడుతుంది. అడ్డొచ్చివారిని దారుణంగా చంపేస్తుంటుంది? అస‌లు ఆ దేవిక ఎవ‌రు? 418 రూమ్‌కు దేవిక‌కు ఉన్న సంబంధ‌మేమిటి? ఆ ఆత్మ బారి నుంచి రోహిత్‌, వికాస్‌, స‌యేషా ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఏం చేశారు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

క‌న్న‌డ సాంగ్‌...

418 రూమ్ గురించి ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇస్తూనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. అందులో ఏదో ఉంద‌నే స‌స్పెన్స్‌ను ఆరంభంలోనే ఆడియెన్స్‌లో క‌లిగించారు. ఆ రూమ్ గురించి వికాస్ సాగించిన అన్వేష‌ణ‌తో ఒక్కో చిక్కుముడి విప్పుతూ వెళ్లారు డైరెక్ట‌ర్‌.
హార‌ర్ సినిమాల్లో ద‌య్యాల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. ఇందులో దేవ‌కి ఆత్మ‌కు కూడా వ్య‌థ‌, బాధ‌తో కూడిన గ‌తం ఉంది. త‌ల్లి కావాల‌నే కోరిక ఆమెను పిచ్చిదానిలా మార్చింద‌న్న‌ది సింప‌థీతో కాకుండా చాలా వ‌య‌లెంట్‌గా చూపించాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సెట‌ప్‌, లొకేష‌న్స్‌, విజ‌వ‌ల్స్ తెలుగు హార‌ర్ సినిమాల‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఓ క‌న్న‌డ సాంగ్ కూడా అప్పుడ‌ప్పుడు వినిపిస్తుంది. ఈ హార‌ర్ సినిమాకు య‌క్ష‌గానం అనే క‌ళ‌ను జోడించ‌డం బాగుంది.

క్లైమాక్స్ డిఫ‌రెంట్‌...

హార‌ర్ సినిమాల్లో చివ‌ర‌కు ఆత్మ బారి నుంచి హీరోహీరోయిన్లు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌టం కామ‌న్‌. కానీ ఈ సినిమా క్లైమాక్స్ డిఫ‌రెంట్‌గా ఎండ్ చేశాడు. మంచి, చెడుల‌లో గెలుపు ఎవ‌రిద‌న్న‌ది చెప్ప‌కుండా సినిమాను ముగించిన‌ట్లుగా అనిపిస్తుంది.
క‌థ ప‌రంగా 418 రొటీన్ హార‌ర్ సినిమానే. కానీ ట్రీట్‌మెంట్‌, సౌండ్ డిజైనింగ్ కొత్త‌గా ఉన్నాయి. బీజీఎమ్‌తో కాకుండా సాధార‌ణ సౌండ్స్‌తో ఆడియెన్స్‌కు థ్రిల్ చేశాడు డైరెక్ట‌ర్‌. టెక్నిక‌ల్‌గా బ్రిలియెంట్ మూవీ.
అంద‌రూ కొత్త యాక్ట‌ర్లే. చైత్ర జే ఆచార్ న‌ట‌న‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే భ‌య‌పెట్టింది. జెన్‌జీ బ్యాచ్‌గా ర‌వితేజ‌, చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు, ప్రీతి ప‌గ‌డాల న‌ట‌న ఒకే. మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ బాగున్నాయి. 418 హార‌ర్ మూవీ ల‌వ‌ర్స్ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా చూడొచ్చు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement