త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram | వందేమాత‌రం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి

Vande Mataram | జాతీయ గేయం వందేమాత‌రం (Vande Mataram) ఆరు చరణాలను ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, కేరళ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ బాలకృష్ణన్ సత్యాభామ మావోజీ సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా ఆలపిస్తున్న విష‌యాన్ని గుర్తు చేశారు.

D

National | Published On Oct 23, 2026, 3.59 pm IST

Vande Mataram | వందేమాత‌రం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి
Advertisement

Vande Mataram | త్రినేత్ర న్యూస్ : జాతీయ గేయం వందేమాత‌రం (Vande Mataram) ఆరు చరణాలను ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, కేరళ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ బాలకృష్ణన్ సత్యాభామ మావోజీ (Balakrishnan Sathyabhama Mavoji) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా ఆలపిస్తున్న విష‌యాన్ని గుర్తు చేశారు. చివరి నాలుగు చరణాల్లో హిందూ దేవతల (Hindu Goddess) ప్రస్తావనలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అన్ని చరణాలను బలవంతంగా పాడమనడం రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తికి, మత స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన వాదించారు.

బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన 'ఆనందమఠం' నవలలోని ఆరు చరణాల సంస్కరణలో హిందూ దేవతలైన దుర్గా, సరస్వతి, లక్ష్మిలను ప్రార్థించే శ్లోకాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇది ఒక మతపరమైన యుద్ధ గేయం లాంటిదని పేర్కొన్నారు. దీన్ని పౌరులపై బలవంతంగా రుద్దడం ద్వారా భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా (Theistic State) మార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి యుద్ధ గేయాలను బలవంతంగా రుద్దడం వల్ల మైనారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 'ఆనందమఠం' నేపథ్యాన్ని పిటిష‌న‌ర్ వివ‌రించారు. ఆనందమఠం నవలలో హిందూ సన్యాసులు ముస్లింలపై పవిత్ర మత యుద్ధం చేసి వారిని హింసాత్మకంగా సంహరిస్తారని.. ఈ యుద్ధంలో వారు చివరకు బ్రిటిష్ వారి మద్దతు కోరతారని చెప్పారు. మొత్తం మీద ఈ నవల ముస్లింలకు వ్యతిరేకంగా హింసాత్మక, ద్వేషపూరిత ఆరోపణలతో నిండి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.

తాను ఒక ఎస్సీ వర్గానికి చెందిన హిందువునని.. అయితే ఆరు చరణాల గేయంలో ప్రస్తావించిన వైష్ణవ, శాక్తేయ మత ఆచారాలను తాను పాటించనని పిటిష‌న‌ర్‌ తెలిపారు. ఈ గేయాన్ని బ‌ల‌వంతంగా పాడించ‌డాన్ని తాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌న‌ని స్ప‌ష్టం చేశారు. అలా చేస్తే దేవ‌త‌ల‌కు, మ‌త సిద్ధాంతాల‌కు త‌ల‌వంచ‌మ‌ని బ‌ల‌వంతం చేసిన‌ట్లే అవుతుంద‌ని వాదించారు. జాతీయోద్యమ నాయకులు వందేమాతరం గేయంలోని మొత్తం ఆరు చరణాలను స్వీకరించడాన్ని వ్యతిరేకించార‌ని గుర్తు చేశారు. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా దీనిని అధికారికంగా ఆమోదించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జాతీయ గేయంగా ఆలపిస్తున్న మొదటి రెండు చరణాల సంస్కరణను మాత్రమే అధికారికంగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

Also Read..

ప‌ర్యావ‌ర‌ణ నాశ‌నానికి మీరే కార‌ణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్ర‌మంత్రి విమ‌ర్శ‌లు

అయ్య‌ప్ప భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక పంపా వ‌ర‌కూ బ‌స్సు

మ‌హారాష్ట్ర‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం కండి.. తుమ్మ‌డిహెట్టి నివేదిక‌ల‌న్నీ రెడీగా ఉంచండి

Advertisement
Advertisement