Idupu Kayitham | అచ్చ తెలంగాణ ఎమోషన్స్‌తో ఇడుపుకాయితం – రిలీజ్ డేట్ చెప్పేశారు
ప్రియదర్శి నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఇడుపుకాయితం మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 11న ఈ తెలంగాణ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి ఏ ఇంటి కోయిలవో నువ్వు అనే పాటను శుక్రవారం రిలీజ్ చేశారు.
Entertainment | Published On Oct 23, 2026, 3.34 pm IST
Idupu Kayitham | ప్రియదర్శి, ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఇడుపుకాయితం మూవీ రిలీజ్ డేట్ చెప్పేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితతో కలిసి నిర్మాత బన్నీవాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
డిసెంబర్‌లో...
ఇడుపుకాయితం విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం రివీల్ చేశారు. డిసెంబర్ 11న ఈ తెలంగాణ మూవీ థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ప్రియదర్శి మాటలకు నాగదుర్గ నవ్వులు కురిపిస్తూ కనిపిస్తోంది.
ఏ ఇంటి కోయిలవో...
ఇడుపుకాయితం మూవీ నుంచి ఏ ఇంటి కోయిలవో నువ్వు మా ఇంటికొచ్చి ప్రతి బంధాన్ని కూయాలే అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. గడప, కురాడు అనే అచ్చ తెలంగాణ పద సాహిత్యంతో పెళ్లి బంధంలోని గొప్పతనాన్ని ఎమోషనల్‌గా ఈ పాటలో ఆవిష్కరించారు. అభినయ శ్రీనివాస్ రాసిన ఈ పాటను తేలు విజయ ఆలపించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
శివజ్యోతి...
ఈ సినిమాలో శ్రీనివాస్‌గా ప్రియదర్శి, శ్రీలత అనే పాత్రలో నాగదుర్గ కనిపించబోతున్నారు.శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టైటిల్ వివాదం...
ఇడుపు కాయితం మూవీపై టైటిల్‌తోనే మంచి బజ్ ఏర్పడింది. ఈ పేరు ట్రోల్ చేస్తూ కొందరు పెట్టిన పోస్ట్‌లు, ట్వీట్స్‌పై తెలంగాణ వాదాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోన్న సెకండ్ మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

418 Movie Review | 418 రివ్యూ – ప్రశాంత్ నీల్ హారర్ మూవీ భయపెట్టిందా? లేదా?…
అక్టోబర్ 23, 2026

Telugu OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
అక్టోబర్ 22, 2026

Movie Review | నా వైఫ్ మిస్సింగ్ మూవీ రివ్యూ – వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Piyush Goyal | పర్యావరణ నాశనానికి మీరే కారణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్రమంత్రి విమర్శలు
- ●Steel bank | హుస్నాబాద్‌లో ‘స్టీల్ బ్యాంక్’.. అభినందించిన కేంద్ర మంత్రి
- ●Girl Dies | దసరా సెలవులకొచ్చి.. బాలిక అనుమానాస్పద మృతి
- ●Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు
- ●KTR | బలహీనంగా భారతీయ జనతా పార్టీ
- ●Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శత్రువులకు వణుకే

Piyush Goyal | పర్యావరణ నాశనానికి మీరే కారణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్రమంత్రి విమర్శలు

Steel bank | హుస్నాబాద్‌లో ‘స్టీల్ బ్యాంక్’.. అభినందించిన కేంద్ర మంత్రి

Girl Dies | దసరా సెలవులకొచ్చి.. బాలిక అనుమానాస్పద మృతి

Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు



