త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | హిట్టు కోసం జాన‌ర్ మార్చిన ఎన్టీఆర్‌ హీరోయిన్ – లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లో..

హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న క‌న్న‌డ బ్యూటీరుక్మిణి వ‌సంత్ త‌న రూటు మార్చింది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతుంది. ఒకే ఒక జీవితం ఫేమ్ శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో తార అనే పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్ క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Oct 23, 2026, 1.52 pm IST

Rukmini Vasanth |  హిట్టు కోసం జాన‌ర్ మార్చిన ఎన్టీఆర్‌ హీరోయిన్ – లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లో..
Advertisement

Rukmini Vasanth |  అందం, అభిన‌యం ఉన్న క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్‌కు(Rukmini Vasanth) అదృష్టం మాత్రం క‌లిసిరావ‌డంలేదు. ఆరేళ్ల సినీ జ‌ర్నీలో తెలుగు(Tollywood), క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో క‌లిపి 12 సినిమాలు చేసింది. అందులో కాంతార ఛాప్ట‌ర్ వ‌న్ మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. అయిన రుక్మిణికి అవ‌కాశాల‌కు ఇబ్బంది లేదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ డ్రాగ‌న్‌తో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తోంది.

ఫ‌స్ట్ టైమ్‌...

హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న ఈ బ్యూటీ త‌న రూటు మార్చింది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని ఓ వీడియో ద్వారా శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. మ్యాడ్‌బాయ్స్ అనే ముగ్గురు యువ‌కులు రుక్మిణి వ‌సంత్‌కు క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ట్లుగా చూపిస్తూ ఫ‌న్నీగా ఈ వీడియో సాగింది.

తార‌గా...

వీడియో చివ‌ర‌లో ఈ సినిమాలో తార అనే పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్ క‌నిపించ‌బోతున్న‌ట్లు రివీల్ చేశారు. రోడ్ ట్రిప్ నేప‌థ్యంలో అడ్వెంచ‌ర‌స్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు చూపించారు. ఇందులో దేవ్ రామ్‌నాథ్, విన‌య్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ఒకే ఒక జీవితం ఫేమ్‌...

ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఒకే ఒక జీవితం ఫేమ్ శ్రీ కార్తిక్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీ చిల‌సౌను నిర్మించిన సిరునీ సినీ కార్పొరేష‌న్‌తో క‌లిసి మ్యాడ్‌బాయ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే టైటిల్‌తో షూటింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఎన్టీఆర్ డ్రాగ‌న్‌...

ప్ర‌స్తుతం ఎన్టీఆర్(NTR) డ్రాగ‌న్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది రుక్మిణి వ‌సంత్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జూన్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. నివీన్ పాల్ మూవీతో మ‌ల‌యాళంలోకి క‌థానాయిక‌గా అరంగేట్రం చేయ‌బోతుంది రుక్మిణి వ‌సంత్‌.

 

Advertisement
Advertisement