త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Netflix | ఓటీటీలో ప్ర‌భాస్ డాక్యుమెంట‌రీ సిరీస్ ట్రెండింగ్ – హాలీవుడ్‌ సినిమాల‌ను దాటేసి…

బాహుబ‌లి, బాహుబ‌లి 2 సినిమాల రూప‌క‌ల్ప‌న వెన‌కున్న ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చ‌ర్చిస్తూ బాహుబ‌లి ది టార్చ్‌బేర‌ర్ పేరుతో ఓ డాక్యుమెంట‌రీ సిరీస్ రూపొందింది. ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది.

N

Entertainment | Published On Jun 27, 2026, 8.25 pm IST

Netflix | ఓటీటీలో ప్ర‌భాస్ డాక్యుమెంట‌రీ సిరీస్ ట్రెండింగ్ – హాలీవుడ్‌ సినిమాల‌ను దాటేసి…
Advertisement

Netflix | బాహుబ‌లి, బాహుబ‌లి 2 సినిమాల‌పై వ‌చ్చిన బాహుబ‌లి ది టార్చ్‌బేర‌ర్ డాక్యుమెంట‌రీ సిరీస్ ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్ర‌స్తుతం ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. టాప్ హీరోల సినిమాల‌ను దాటేసి టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి వ‌చ్చింది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 రూప‌క‌ల్ప‌న‌లో తెర‌వెనుక ఏం జ‌రిగింద‌న్న‌ది ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌లో చూపించారు. బాహుబ‌లి కోసం ప్రభాస్ పడిన శ్రమ, తన కెరీర్ నే పణంగా పెట్టి రిస్క్ తీసుకోవ‌డంపై నెటిజ‌న్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హార్స్ రైడింగ్‌...

తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఐదేళ్లు బాహుబలి కోసం కేటాయించారు ప్ర‌భాస్‌. ఈ సినిమా తప్ప మరే ప్రాజెక్ట్ చేయ‌లేదు. హార్స్ రైడింగ్, స్వార్డ్ ఫైటింగ్, హిల్ క్లైంబింగ్, వార్ యాక్షన్ సీక్వెన్స్ ల‌లో ట్రైనింగ్ తీసుకోవ‌డ‌మే కాకుండా డూప్ లేకుండా ఈ స‌న్నివేశాల్లో న‌టించారు. బాహుబ‌లి, బాహుబ‌లి 2 కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యారు. ఇలా ప్రభాస్ చేసిన ఎన్నో త్యాగాల ఫ‌లితంగానే బాహుబలి రూపుదిద్దుకుంది. తాను కష్టపడుతూనే దర్శకుడు రాజమౌళికి ప్రోత్సాహం అందిస్తూ, మోరల్ సపోర్ట్ గా నిలిచార‌న్న‌ది ఈ సిరీస్‌లో చూపించారు.

బాహుబ‌లి 3...

అందరి కంటే ఎక్కువగా బాహుబలి కాన్సెప్ట్ ను, రాజమౌళి విజన్ ను నమ్మారు ప్రభాస్. అందుకే ఆయన ఈ సినిమా కోసం ఎంత శ్రమైనా తీసుకున్నారు. తన నమ్మకంతో ప్రభాస్ మిగతా టీమ్ మెంబ‌ర్స్‌లో ఆ స్ఫూర్తిని నింపారు. బాహుబ‌లి సినిమాకు మొద‌టి రోజు నెగెటివ్ రివ్యూలు వ‌చ్చాయ‌ని ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌లో రాజ‌మౌళి, ర‌మా రాజ‌మౌళి చెప్పారు. డిజాస్ట‌ర్ అంటూ కామెంట్లు రావ‌డంతో త‌మ ఆస్తుల‌ను అమ్మాల్సివ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ్డామ‌ని అన్నారు. వారు చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.
బాహుబ‌లి, బాహుబ‌లి 2 సినిమాల‌కు కొన‌సాగింపుగా బాహుబ‌లి 3ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌భాస్, అనుష్క‌, రానా క‌లిసి ఈ సిరీస్‌లో ప్ర‌క‌టించారు.

 

Advertisement
Advertisement