Divija Prabhakar | హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు – పల్లెటూరి ప్రేమకథలో…
ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. వెంకట్రామయ్యగారి తాలూకా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. విలేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజైంది.
Entertainment | Published On Feb 8, 2026, 10.30 pm IST
Divija Prabhakar | బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా మారాడు. ఇటీవలే బరాబర్ ప్రేమిస్తా పేరుతో ఓ సినిమా చేశాడు. బూతు సాంగ్ వివాదం కారణంగా గత కొద్ది రోజులుగా ప్రభాకర్‌తో పాటు చంద్రహాస్ పేరు టాలీవుడ్‌లో తెగ వినిపిస్తోంది. చంద్రహాస్ తర్వాత ప్రభాకర్ ఫ్యామిలీ నుంచి ఆయన కూతురు దివిజ కూడా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తోంది. వెంకట్రామయ్యగారి తాలూకా పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బగలం ఫేమ్ మురళీధర్‌గౌడ్, సీనియర్ నటి సుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కాశీవిశ్వనాథ్, మిర్చిమాధవి, జబర్దస్త్ ఫేం సత్యశ్రీ, మొగలిరేకులు సీరియల్ ఫేం ఇక్బాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్రామయ్యగారి తాలూకా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వెంకట్రామయ్యగా టైటిల్ పాత్రలో మురళీధర్ గౌడ్ కనిపించబోతున్నారు. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు తరహాలోనే ఫీల్‌గుడ్ మూవీగా వెంకట్రామయ్యగారి తాలూకా ఉంటుందని డైరెక్టర్ పేర్కొన్నారు.
దివిజ ప్రస్తుతం హే చికితా పేరుతో కూడా ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. సినిమాల కంటే ముందు కొన్ని సీరియల్స్‌లో కూడి దివిజ ప్రభాకర్ నటించింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



