త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Posani Krishna Murali | ప‌దిహేనేళ్ల త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టిన పోసాని – రాజ‌కీయాలతో సంబంధం లేదంటూ కామెంట్స్‌

ప‌దిహేనేళ్ల‌ సుదీర్ఘ విరామం త‌ర్వాత పోసాని కృష్ణ ముర‌ళి మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టారు. ఆప‌రేష‌న్ అరుణా రెడ్డి పేరుతో ఓ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ సినిమాలో పోసాని హీరోగా న‌టిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో త‌న‌కు ఏ రాజ‌కీయ పార్టీల‌తో సంబంధం లేద‌ని పోసాని వ్యాఖ్యానించారు.

N

Entertainment | Published On May 7, 2026, 3.30 pm IST

Posani Krishna Murali | ప‌దిహేనేళ్ల త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టిన పోసాని – రాజ‌కీయాలతో సంబంధం లేదంటూ కామెంట్స్‌
Advertisement

Posani Krishna Murali | టాలీవుడ్ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ పోసాని కృష్ణ ముర‌ళి ప‌దిహేనేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ డైరెక్ట‌ర్‌గా మారాడు. ఆప‌రేష‌న్ అరుణారెడ్డి పేరుతో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇందులో పోసానినే హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చీర క‌ట్టుకొని పోసాని కృష్ణ ముర‌ళి క‌నిపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

విల‌న్ క‌మ్ హీరో...

ఈ సినిమాలో హీరోగానే కాకుండా తానే విల‌న్‌గా కూడా క‌నిపించ‌బోతున్న‌ట్లు గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో పోసాని ప్ర‌క‌టించారు. నిజాయితీప‌రుడైన జ‌ర్న‌లిస్టుల క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంద‌ని పోసాని అన్నారు. "ఇందులో నేను బొమ్మారెడ్డి అరుణారెడ్డి పాత్ర‌లో క‌నిపిస్తా. రాజ‌కీయాల్లోని అవినీతిని ఎండ‌గ‌ట్టే జ‌ర్న‌లిస్ట్ పాత్ర చేస్తున్నా. ప్ర‌జాసేవ సేవ కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు ఎవ‌రూ? త‌మ వ్యాపారాల‌ను కాపాడుకోవ‌డం కోసం పాలిటిక్స్‌లోకి ఎవ‌రూ వ‌చ్చారు అన్న‌ది సందేశాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించ‌బోతున్నా. ఏ రాజ‌కీయ పార్టీని, నాయ‌కుల‌ను విమ‌ర్శించేలా ఈ సినిమా ఉండ‌దు" అని పోసాని కృష్ణ ముర‌ళి చెప్పారు.

రాజ‌కీయాల‌తో సంబంధం లేదు...

రాజ‌కీయాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని ఆప‌రేష‌న్ అరుణా రెడ్డి ఈవెంట్‌లో పోసాని పేర్కొన్నారు. చాలా రోజుల త‌ర్వాత తాను సినిమా చేసుకుంటున్నాన‌ని, త‌న‌ను రోడ్డున ప‌డేయ‌ద్ద‌ని కామెంట్లు చేశారు. న‌న్ను క్ష‌మిస్తే ఇక నుంచి సినిమాలు బాగా చేసుకుంటున్నాని చెప్పారు. రాజ‌కీయాల్లో ఉండాలంటే ప్ర‌జా సేవ చేయాలి. జైలుకు వెళ్లాలి త‌ప్ప‌దు అని పోసాని పేర్కొన్నారు. తాను ప్ర‌జ‌ల‌కు మంచి చేసే పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చానని,  వైఎస్సార్‌సీపీలో చేర‌లేద‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో చిరంజీవి, చంద్ర‌బాబు, ఎన్టీఆర్‌తో పాటు అంద‌రికి స‌పోర్ట్ చేశాన‌ని చెప్పారు. తాను అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని , బ్రోక‌ర్ ప‌నులు చేయ‌లేద‌ని పోసాని వెల్ల‌డించారు.
"జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నాకు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేశారు. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ తీసుకోమ‌న్నారు. నేను అవినీతి ప‌రుడిని అయితే జ‌గ‌న్ వ‌ద్ద నుంచి ఐదు ఎక‌రాలు తీసుకొని స్టూడియోలు క‌ట్టుకునేవాడిని.
నిజాలు మాట్లాడినందుకు త‌న‌పై దొంగ‌గా, రౌడీగా ముద్ర వేశారు" అని పోసాని పేర్కొన్నారు. ఆప‌రేష‌న్ అరుణా రెడ్డిలో హిందోళ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ముమైత్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

 

Advertisement
Advertisement