త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pujita Ponnada | రంగ‌స్థ‌లం బ్యూటీ హార‌ర్ మూవీ – రాజ‌భ‌వ‌నంలో న‌ర్త‌కిగా …

రంగ‌స్థలం, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాల ఫేమ్ పూజిత పొన్నాడ తెలుగులో ఓ హార‌ర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ హార‌ర్ మూవీ నుంచి ఈ అచ్చ తెలుగు బ్యూటీ ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. రాజ‌భ‌వ‌నంలో న‌ర్త‌కిగా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో పూజిత క‌నిపిస్తోంది.

N

Entertainment | Published On Oct 5, 2026, 5.58 pm IST

Pujita Ponnada | రంగ‌స్థ‌లం బ్యూటీ హార‌ర్ మూవీ – రాజ‌భ‌వ‌నంలో న‌ర్త‌కిగా …
Advertisement

Pujita Ponnada | ఊపిరి సినిమాతో నటిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూజిత పొన్నాడ‌. రంగ‌స్థ‌లం, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు, ప్రేమ‌మ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది. వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి, ఓదెల రైల్వే స్టేష‌న్‌తో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించింది. అందంతోనే కాకుండా అభిన‌యంతో ప‌లు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది ఈ అచ్చ తెలుగు సుందరి . అయినా పూజితకు ఆశించిన స్థాయిలో పేరుతో పాటు అవ‌కాశాలు రావ‌డం లేదు.

హార‌ర్ మూవీలో

పూజిత పొన్నాడ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ఆమె కొత్త మూవీ నుంచి స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. హార‌ర్ మూవీలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ క‌నిపించ‌బోతుంది. ఆమె ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.ఈ పోస్ట‌ర్‌లో రాజ‌భ‌వ‌నంలో న‌ర్తకిగా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో పూజిత పొన్నాడ క‌నిపిస్తోంది. ఇంకా పేరు పెట్ట‌ని ఈ సినిమాకు ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం ఫేమ్ శ్రీధ‌ర్ గాదె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హార‌ర్ మూవీ ఇదని,  ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

క‌మిటీ కుర్రాళ్లు ఫేమ్‌...

రెండు నేష‌న‌ల్ అవార్డుల‌తో స‌త్తా చాటిన క‌మిటీ కుర్రాళ్లు సినిమాలో హీరోగా న‌టించిన ఈశ్వ‌ర్ రాచిరాజు ఈ హారర్ సినిమాలో క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. పూజిత పొన్నాడ‌తో పాటు నందు, లిఖిత హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. సింధు కాసారం మ‌రో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతుంది.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. త్వరలోనే టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు.,

 

Advertisement
Advertisement