Anupama Parameswaran | పక్కా తెలంగాణ అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ – బ్రేకప్ తర్వాత ఫస్ట్ మూవీ…
అనుపమ పరమేశ్వరన్ పక్కా తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతుంది. ఈ మలయాళ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన క్రేజీ కళ్యాణం మూవీ టీజర్ శనివారం రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ టీజర్ హిలేరియస్‌గా నవ్వించింది.
Entertainment | Published On Aug 1, 2026, 3.43 pm IST
Anupama Parameswaran | ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణ సంస్కృతి, యాస, భాషలతో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో ఈ కథల్లో నటించడానికి స్టార్స్ సైతం ఆసక్తిని చూపుతున్నారు. మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ టైమ్ పక్కా తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతుంది.
టీజర్ రిలీజ్...
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ క్రేజీ కళ్యాణం. భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు.
తెలంగాణ నేపథ్యంలో ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. తండ్రీ కూతుళ్లుగా సీనియర్ నరేష్, అనుపమ పరమేశ్వరన్‌లను పరిచయం చేస్తూ ఈ టీజర్ మొదలైంది. కూతురి పెళ్లి కోసం ఓ తండ్రి పడే ఆరాటం, పెళ్లిలో జరిగే గొడవలు, ఓ జంట ప్రేమకథతో ఆద్యంతం టీజర్ ఫన్నీగా ఉంది. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో అనుపమ చెప్పిన డైలాగ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. తాగుబోతుగా తరుణ్ భాస్కర్, అనుపమ తండ్రిగా సీనియర్ నరేష్ పాత్రలు హిలేరియస్‌గా నవ్విస్తున్నాయి. అనుపమను ప్రేమించే యువకుడిగా అఖిల్ రాజ్ కనిపించారు.
షూటింగ్ కంప్లీట్...
పెళ్లి నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా క్రేజీ కళ్యాణం మూవీని దర్శకుడు భద్రప్ప తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది.
బ్రేకప్ తర్వాత...
కోలీవుడ్ హీరోతో గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అనుపమ పరమేశ్వరన్ మనస్పర్థల కారణంగా అతడికి బ్రేకప్ చెప్పినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లవ్ బ్రేకప్ తర్వాత ఫస్ట్ టైమ్ ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్‌తో మీడియా ముందుకు వచ్చింది.
భోగి...
ప్రస్తుతం క్రేజీ కళ్యాణంతో పాటు తెలుగులో భోగి సినిమా చేస్తోంది అనుపమ పరమేశ్వరన్, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కందుల సులోచనరాణి అనే పాత్రలో కనిపించబోతుంది. పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు డింపుల్ హయతి మరో హీరోయిన్‌గా కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ – ఇప్పుడు ప్రొడ్యూసర్ – నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
ఆగస్టు 3, 2026

Keerthy Suresh | ప్యారడైజ్ కోసం కీర్తి సురేష్ రెండు రోజులు నిద్రకు దూరం – మహానటిపై నెటిజన్ల ప్రశంసలు
ఆగస్టు 3, 2026

Pooja Hegde | ప్రియుడిని పెళ్లాడనున్న బుట్టబొమ్మ – రూమర్లపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Guvvala Balaraj | మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు.. పీఎస్‌కు తరలింపు
- ●Kerala Fishermen | కేరళలో 469 మంది జాలర్లు మృతి
- ●HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
- ●National Handloom Day | చేనేత రంగం పునరుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
- ●Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్
- ●Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?

Guvvala Balaraj | మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు.. పీఎస్‌కు తరలింపు

Kerala Fishermen | కేరళలో 469 మంది జాలర్లు మృతి

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..

National Handloom Day | చేనేత రంగం పునరుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మల



