Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ – అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే
శ్రీ శ్రీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది పూజా హెగ్డే. బుట్టబొమ్మ బర్త్‌డే సందర్భంగా మంగళవారం మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అచ్చ తెలుగు అమ్మాయిగా ట్రెడిషనల్ లుక్‌లో పూజా హెగ్డే కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Oct 13, 2026, 12.33 pm IST
Pooja Hegde | తెలుగులో పూజా హెగ్డే సినిమా చేసి నాలుగేళ్లు దాటిపోయింది. 2022లో రిలీజైన చిరంజీవి ఆచార్య తర్వాత బుట్టబొమ్మకు ఒక్క అవకాశం దక్కలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీ శ్రీ మూవీతో టాలీవుడ్‌లోకి పునరాగమనం చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు రవి నేటకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు.
పూజా హెగ్డే బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నుదిటిపై బొట్టు...కుర్తా ధరించి సింపుల్ లుక్‌లో అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే కనిపిస్తోంది. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
షూటింగ్ కంప్లీట్...
రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న శ్రీ శ్రీ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో శ్రీ శ్రీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్నదానికంటే ముందే షూటింగ్‌తో పాటు నిర్మాణారంతర కార్యక్రమాలు పూర్తికావడంతో నవంబర్‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను రివీల్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
భారీగానే రెమ్యూనరేషన్...
సినిమాల పరంగా సక్సెస్‌లు లేకపోయినా శ్రీశ్రీ కోసం పూజా హెగ్డే భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. మూడు కోట్లు స్వీకరించినట్లు చెబుతున్నారు.
శ్రీ శ్రీ సినిమాలో దీక్షిత్ శెట్టి, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్యారడైజ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న 41వ మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Devarakonda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు
అక్టోబర్ 13, 2026

Pawan Kalyan 30 Years In Cinema | ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ఇప్పటివరకు: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానంపై అల్లు అరవింద్ భావోద్వేగ సందేశం
అక్టోబర్ 12, 2026

Bhagyashri Borse | అల్ట్రా మోడ్రన్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
- ●Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు
- ●Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..
- ●Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్
- ●Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..
- ●OnePlus 16 | వన్‌ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు

Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..

Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్



