Pooja Hegde | ఓటీటీలోకి పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – ఒకే సారి ప్రియురాలు .. భార్య ప్రెగ్నెంట్ అయితే!
పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హై ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జీ5 ఓటీటీలో జూలై సెకండ్ వీక్ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Entertainment | Published On Jun 25, 2026, 2.36 pm IST
Pooja Hegde | పూజాహెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ రొమాంటిక్ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హై థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాకు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కు ముందు కోర్టు కేసుల కారణంగా వివాదాలతోనే ఈ బాలీవుడ్ మూవీ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తన సినిమాతో పాటు పాటలను కాపీ కొట్టి ఈ సినిమా తీశారంటూ సీనియర్ ప్రొడ్యూసర్ వషు భగ్నానీ...హై జవానీతో ఇష్క్ హోనా హై డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్లపై కేసు పెట్టారు.
70 కోట్ల కలెక్షన్స్...
ఈ వివాదాలతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 70 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. తాజాగా హై జవానీ తో ఇస్క్ హోనా హై మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ దక్కించుకుంది. జూలై సెకండ్ వీక్‌లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. జూలై 10న రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
చివరి సినిమా...
హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో మనీష్ పాల్, చుంకీ పాండే, మౌనీరాయ్ కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్‌గా ఇదే తన చివరి సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ డేవిడ్ ధావన్ ప్రకటించారు.
ప్రియురాలు...భార్య...
జాస్ ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. బానిని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. పిల్లల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. ఓ పెళ్లి కోసం లండన్ వెళ్లిన జాస్‌కు ప్రీత్ పరిచయమవతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. తాను ప్రెగ్నెంట్ అని తెలియడంతో విడాకుల నిర్ణయాన్ని బాని వాయిదా వేస్తుంది. జాస్‌తోనే కలిసి బతకాలని అనుకుంటుంది. మరోవైపు జాస్ కారణంగా ప్రీత్ కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? బాని, ప్రీత్ మధ్య జాస్ ఎలా నలిగిపోయాడు? ప్రీత్ గురించి బానికి తెలిసిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shruti Haasan | అప్పుడు నాన్నకు బాగా కోపం వచ్చింది.. చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకున్న శ్రుతి హాసన్
జూన్ 24, 2026

Tamannaah | ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ – బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్
జూన్ 23, 2026

Mrunal Thakur | కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్ – కల నిజమైందంటూ ఎమోషనల్ పోస్ట్
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు..
- ●SEBI | ఫిన్ఫ్లూయెన్సర్లకు సెబీ కొత్త షాక్.. 5 లక్షల ఫాలోవర్లు దాటితే స్పాన్సర్డ్ కంటెంట్ రూల్స్ మరింత కఠినం..
- ●Sukumar Wife | నేను పక్కా తెలంగాణ అమ్మాయినే - డైరెక్టర్ సుకుమార్ భార్య కామెంట్స్
- ●Dharmendra Pradhan | రాజకీయ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.. రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు
- ●Lava Smart 4 Plus | రూ.9,999కే లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్..
- ●Amazon | ప్రధాని మోదీని కలిసిన అమెజాన్ సీఈవో.. భారత్‌లో మరో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..

Stock Markets | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు..

SEBI | ఫిన్ఫ్లూయెన్సర్లకు సెబీ కొత్త షాక్.. 5 లక్షల ఫాలోవర్లు దాటితే స్పాన్సర్డ్ కంటెంట్ రూల్స్ మరింత కఠినం..

Sukumar Wife | నేను పక్కా తెలంగాణ అమ్మాయినే - డైరెక్టర్ సుకుమార్ భార్య కామెంట్స్

Dharmendra Pradhan | రాజకీయ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.. రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు



