Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ – నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు
రామ్‌చరణ్ రంగస్థలంతో పాటు వెంకటేష్ ఎఫ్ 3 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. గత గ్యాప్ తర్వాత తెలుగులో మరోసారి పూజా హెగ్డే ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ సారి నాచురల్ స్టార్ నానితో స్టెప్పలు వేయబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Jul 27, 2026, 5.38 pm IST
Pooja Hegde | ఓ వైపు సినిమాలు చేస్తూనే అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరుస్తున్నారు నేటి హీరోయిన్లు. రామ్‌చరణ్ రంగస్థలంలో పూజా హెగ్డే ఐటెంసాంగ్ చేసింది. జిగేలు రాణి పాటలో తన డ్యాన్సులతో అదరగొట్టింది. ఆ తర్వాత వెంకటేష్ ఎఫ్ 3 ప్రత్యేక గీతంలో కనిపించింది. కొంత గ్యాప్ తర్వాత పూజా హెగ్డే మరోసారి తెలుగులో ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సారి నాచురల్ స్టార్ నానితో స్టెప్పులు వేయబోతున్నట్లు చెబుతోన్నారు.
కయదు లోహర్ హీరోయిన్...
దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ప్యారడైజ్ మూవీ రాబోతుంది. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్‌బాబు విలన్‌గా కనిపించబోతున్నాడు.
స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్...
ప్యారడైజ్ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. స్పెషల్ సాంగ్‌తో పాటు కొంత టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం బుట్టబొమ్మ పూజా హెగ్డే ను మేకర్స్ ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఐటెంసాంగ్‌లో పాన్ ఇండియన్ వైడ్‌గా క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితేనే బెటర్ అని భావించిన మేకర్స్ ఈ బ్యూటీని అప్రోచ్ అయినట్లు టాక్ నడుస్తోంది. రెమ్యూనరేషన్ భారీగా ఆఫర్ చేయడంతో పూజా హెగ్డే ఈ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఫారిన్ వెకేషన్...
నాని, పూజా హెగ్డేలపై చిత్రీకరించే ఈ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్‌లో మేకర్స్ ఓ భారీ సెట్‌ను వేస్తోన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పూజా హెగ్డే ఫారిన్ వెకేషన్‌లో ఉంది. ఇండియాకు రాగానే ఈ ఐటెంసాంగ్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.
జననాయగన్...
ఇటీవలే తమిళనాడు సీఎం దళపతి విజయ్ జననాయగన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది పూజా హెగ్డే. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో శ్రీశ్రీ సినిమా చేస్తోంది. రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్న ఈ ఏడాదే థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ – ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్
జులై 27, 2026

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ – కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ – ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?
జులై 26, 2026
తాజావార్తలు
- ●Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
- ●Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
- ●IndiGo flight | విమానం గాల్లో ఉండగా పొగలు.. ప్రయాణికుల్లో టెన్షన్.. టెన్షన్
- ●Manipal Health IPO | ఈ వారంలోనే మణిపాల్ హెల్త్ ఐపీవో.. 4 శాతం లాభాలకు చాన్స్..
- ●Bakka Judson | కొండా సురేఖ రేవంత్‌నే కేర్ చేయద్.. ఇగ కడియం ఎంత
- ●AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్

Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

IndiGo flight | విమానం గాల్లో ఉండగా పొగలు.. ప్రయాణికుల్లో టెన్షన్.. టెన్షన్

Manipal Health IPO | ఈ వారంలోనే మణిపాల్ హెల్త్ ఐపీవో.. 4 శాతం లాభాలకు చాన్స్..



