Hero Arya | తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు
తమిళ హీరో ఆర్య పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. కెమెరా, లైటింగ్ ఎక్విప్‌మెంట్ సంస్థకు ఇవ్వాల్సిన కోటి ఎనభై లక్షల రెంట్‌ను ఎగ్గొట్టినందుకు అతడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్‌కు చెందిన తాహెర్ స్టూడియో సంస్థ కేసు పెట్టింది.
Entertainment | Published On Jul 12, 2026, 1.17 pm IST
Hero Aarya | తమిళ హీరో ఆర్య చిక్కుల్లో పడ్డాడు. అతడిపై సినిమా షూటింగ్‌లకు కెమెరాలతో పాటు లైటింగ్ ఎక్విప్‌మెంట్‌లను అద్దెకు ఇచ్చే హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ చీటింగ్ కేసు పెట్టింది. ఆర్య ప్రధాన పాత్రలో అనంతన్ కాడు పేరుతో ఓ మలయాళ మూవీ రూపొందింది. ఈ సినిమా షూటింగ్ కోసం తాహెర్ స్టూడియో నుంచి మేకర్స్ హై ఎండ్ డిజిటల్ కెమెరాలు, అడ్వాన్స్ లైటింగ్ ఎక్విప్‌మెంట్‌లను రెంట్‌కు తీసుకున్నారు. అనంతన్ కాడు మూవీ జూన్‌లోనే రిలీజైంది. అయినా ఆర్య అండ్ టీమ్ మాత్రం తాహెర్ స్టూడియోకు ఇవ్వాల్సిన కోటి ఎనభై లక్షల రెంట్ డబ్బులు చెల్లించలేదట. కెమెరా, లైటింగ్ ఎక్విప్‌మెంట్ రెంట్ డబ్బులు అడిగినందుకు ఆర్యతో పాటు చిత్రబృందం తమతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు తాహెర్ స్టూడియో ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్‌ను స్వీకరించిన పోలీసులు ఆర్యతో పాటు అనంతన్ కాడు నిర్మాత వినోద్, అసిస్టెంట్ కిషోర్‌లపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అల్లు అర్జున్ వరుడులో....
తమిళంలో హీరోగా పలు సినిమాలు చేసిన ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అతడు హీరోగా నటించిన పలు తమిళ సినిమాలు నేనే అంబానీ, వాడు వీడు, సర్వం లాంటి టైటిల్స్‌తో రిలీజయ్యాయి. అల్లు అర్జున్ వరుడు మూవీలో విలన్‌గా ఆర్య నటించాడు. వెంకటేష్ సైంధవ్‌తో పాటు మరికొన్ని తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లోనూ నటించాడు. 2021లో వచ్చిన సర్పట్ట పరంబరై తర్వాత హీరోగా ఆర్యకు తమిళంలో సరైన హిట్టు లేదు.
సంబంధిత వార్తలు

Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ – 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!
జులై 11, 2026

Ntr Vs Dhanush | ఎన్టీఆర్‌కు ధనుష్ కౌంటర్ – గాడ్ ఆఫ్ వార్‌కు పోటీగా మైథాలజీ మూవీ అనౌన్స్ – ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
జులై 11, 2026

Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ – జననాయగన్ సెన్సార్ కంప్లీట్ – మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
జులై 9, 2026
తాజావార్తలు
- ●Janaki | అక్షరం ముక్క రాకపోయినా గేయరచయితగా మెప్పించిన గానకోకిల!
- ●S Janaki Net Worth | ఎస్ జానకి మొత్తం ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లంటే?
- ●Pigs | వరద నీటిలో పందులు విలవిల.. ప్రాణాలతో కాపాడిన చైనీయులు..
- ●Bengaluru | మర్మాంగాలను చూపించిన డెలివరీ బాయ్.. షాకైన మహిళ
- ●Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
- ●Lion | 11 ఏళ్ల బాలుడిని చంపిన సింహాం.. ఆపై మృగరాజుకు వాంతులు

Janaki | అక్షరం ముక్క రాకపోయినా గేయరచయితగా మెప్పించిన గానకోకిల!

S Janaki Net Worth | ఎస్ జానకి మొత్తం ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లంటే?

Pigs | వరద నీటిలో పందులు విలవిల.. ప్రాణాలతో కాపాడిన చైనీయులు..

Bengaluru | మర్మాంగాలను చూపించిన డెలివరీ బాయ్.. షాకైన మహిళ



