త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | మైథాల‌జీ క‌థ‌తో తెలుగు వెబ్‌సిరీస్ – పోచ‌మ్మ రిలీజ్ ఎప్పుడంటే?

మైథాల‌జీ క‌థ‌తో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. పోచ‌మ్మ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. పోచ‌మ్మ రిలీజ్ ఎప్పుడంటే?

N

Entertainment | Published On Mar 9, 2026, 7.58 pm IST

Web Series | మైథాల‌జీ క‌థ‌తో తెలుగు వెబ్‌సిరీస్ – పోచ‌మ్మ రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Web Series | ప్ర‌స్తుతం సినీ ప‌రిశ్ర‌మ‌లో మైథాల‌జీ ట్రెండ్ న‌డుస్తోంది. భ‌క్తి క‌థ‌ల‌తో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోన్నాయి. పురాణాలు, ఇతిహాసాల‌తో స్టార్ హీరోలు సినిమాలు చేస్తోన్నారు. మైథాల‌జీ జాన‌ర్‌ ప‌ట్ల ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపిస్తుండ‌టంతో ఈ క‌థ‌ల‌తో వెబ్‌సిరీస్‌ల‌ను తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రెడీ అవుతోన్నారు. తాజాగా పోచ‌మ్మ పేరుతో ఓ తెలుగు వెబ్‌సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్‌డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ ఖ‌రారు అయ్యాయి.

ఆహా ఓటీటీలో..

పోచ‌మ్మ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ఓ ఇంటితో పాటు దేవత విగ్ర‌హాన్ని చూపిస్తూ ఈ గ్లింప్స్ ఆస‌క్తిక‌రంగా సాగింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటోంది.

ఏప్రిల్‌లో రిలీజ్‌...

ర‌మేష్ ఇంద్ర లీడ్ రోల్‌లో న‌టిస్తూ పోచ‌మ్మ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రియా, శృతి నాయుడు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. కొత్త న‌టీన‌టుల‌తో ఈ సిరీస్ రూపొందిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. ఎల్‌వీ గ‌ణేష‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్‌లో పోచ‌మ్మ సిరీస్ విడుద‌ల కానున్న‌ట్లు ఆహా ఓటీటీ ప్ర‌క‌టించింది.

Advertisement
Advertisement