త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi | మ‌రో వివాదంలో పెద్ది – అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల‌ డిమాండ్‌

పెద్ది మూవీ మ‌రో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు, సంభాష‌న‌లు త‌మ‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని ఆదివాసీలు పేర్కొన్నారు. పెద్ది మేక‌ర్స్‌పై అట్రాసిటీ కేసు పెట్టాల‌ని విజ‌యన‌గ‌రం క‌లెక్ట‌ర్‌తో పాటు ఎస్‌స్పీకి ఫిర్యాదు చేశారు.

N

Entertainment | Published On Jun 8, 2026, 5.30 pm IST

Peddi | మ‌రో వివాదంలో పెద్ది  – అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల‌ డిమాండ్‌
Advertisement

Peddi |  రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ క‌లెక్ష‌న్స్‌, రికార్డుల‌తో కంటే జాన్వీ క‌పూర్ వివాదంతోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ వివాదం ఎఫెక్ట్ పెద్దిపై గ‌ట్టిగానే ప‌డింది. పెద్ది మూవీకి క‌లెక్ష‌న్స్ రెండో రోజు నుంచి భారీగా డ్రాప్ కావ‌డానికి ఈ జాన్వీ క‌పూర్ కాంట్ర‌వ‌ర్సీ ఓ కార‌ణ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. తాజాగా పెద్ది మూవీ మ‌రో స‌మ‌స్య‌లో చిక్కుకుంది. పెద్ది మేక‌ర్స్‌పై అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని గిరిజ‌నులు డిమాండ్ చేస్తోన్నారు.

అట్రాసిటీ కేసు...

గిరిజ‌నుల‌ను కించ‌ప‌రిచేలా పెద్ది సినిమాలో కొన్ని స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఉన్నాయ‌ని ఆదివాసీలు పేర్కొన్నారు. కొండ నా కొడ‌కా లాంటి డైలాగ్స్‌తో సినిమాలో త‌మ‌ జాతిని త‌క్కువ చేసి చూపించ‌డ‌మే కాకుండా మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశార‌ని అన్నారు. పెద్ది మేక‌ర్స్‌తో పాటు సెన్సార్ స‌భ్యుల‌పై అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని ఆదివాసీలు డిమాండ్ చేశారు. అంతే కాకుండా పెద్ది మేక‌ర్స్‌పై విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌ర్‌తో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌...

ఈ సినిమాలో ఎలాంటి ర‌వాణా స‌దుపాయం లేని కొండ ప్రాంతానికి చెందిన కూలీగా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చూపించారు. త‌న ఊరి క‌ష్టాల‌ను తీర్చ‌డం కోసం క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌గా ఎలా మారాడ‌నే పాయింట్‌తో పెద్ది మూవీని తెర‌కెక్కించారు.

హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్‌...

పెద్ది మూవీలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌గా...శృతి హాస‌న్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. పెద్ది మూవీకి ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించారు. ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ నాలుగు రోజుల్లోనే 290 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఏడాది తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

 

Advertisement
Advertisement