Janhvi Kapoor | ఫైర్‌బ్రాండ్ అచ్చియమ్మ – పెద్ది నుంచి జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
జాన్వీ కపూర్ బర్త్‌డే సందర్భంగా పెద్ది నుంచి మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ లుక్‌లో ఫైర్‌బ్రాండ్‌గా జాన్వీకపూర్ కనిపిస్తోంది. పెద్దిలో జాన్వీ అచ్చియమ్మ అనే యంగ్ పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించబోతుంది.
Entertainment | Published On Mar 6, 2026, 1.07 pm IST
Janhvi Kapoor | జాన్వీకపూర్ బర్త్‌డే సందర్భంగా పెద్ది నుంచి మేకర్స్ ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రివీల్ చేశారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు.
కొత్త పోస్టర్ రిలీజ్...
జాన్వీకపూర్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం జాన్వీకపూర్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లంగా ఓణీలో కళ్లద్ధాలు ధరించి ట్రెడిషనల్, గ్లామర్ కలబోసిన డేరింగ్ అండ్ డాషింగ్ లుక్‌లో ఫైర్‌బ్రాండ్‌గా జాన్వీకపూర్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పెద్దిలో జాన్వీకపూర్ అచ్చియమ్మ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుంది.
యంగ్ పొలిటికల్ లీడర్‌గా...
పోస్టర్‌తో పాటు ఓ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. జాన్వీకపూర్ పాత్ర తాలుకు షూటింగ్ విశేషాలను చూపిస్తూ ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. ఈ వీడియో చూస్తుంటే ఇందులో జాన్వీకపూర్ యంగ్ పొలిటికల్ లీడర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ధైర్యవంతురాలైన యువతిగా చాలా పవర్‌ఫుల్‌గా జాన్వీ క్యారెక్టర్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సానా పెద్దిలో చూపించబోతున్నట్లు కనిపిస్తోంది. డైలాగ్ డెలివరీ, బాడీలాంగ్వేజ్ చాలా మాసీగా ఉన్నాయి.
జాన్వీకపూర్...
పెద్ది మూవీలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలుత ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో ఈ సినిమా ఏప్రిల్ 30కి వాయిదాపడింది.
పెద్దికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా తెలుగులో జాన్వీకపూర్ నటిస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దేవర 2లో జాన్వీ కథానాయికగా కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026

Peddi Trailer | గుడిలో కాదు గ్రౌండ్లో దేవుడు – క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా రామ్‌చరణ్ – పెద్ది ట్రైలర్ రిలీజ్
మే 18, 2026

Chiranjeevi | ముగ్గురు కలిసి రఫ్ఫాడించేశారు – పెద్ది ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ – డైలాగ్ లీక్
మే 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



