Peddi | ట్రోల్స్ ఎఫెక్ట్ – క్షమాపణల చెప్పిన పెద్ది డైరెక్టర్ – జాన్వీ కపూర్ ముద్దు సీన్లు కట్
పెద్ది మూవీలో జాన్వీ కపూర్ పాత్రపై వస్తోన్న విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు సానా రియాక్ట్ అయ్యారు. మహిళలను అగౌరవపరచాలని ఆ సీన్లను పెట్టలేదని అన్నారు. జాన్వీ కపూర్ సీన్లలో మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు.
Entertainment | Published On Jun 6, 2026, 10.48 am IST
Peddi | పెద్ది సినిమాపై ప్రశంసలతో పాటు అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను తీర్చిదిద్దిన విధానం, రామ్‌చరణ్‌తో ఆమె కాంబినేషన్‌లో వచ్చే సీన్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. మహిళలను కించపరిచేలా ఈ సీన్లు ఉన్నాయని, కేవలం గ్లామర్ కోసమే ఆమెను ఈ సినిమాలోకి తీసుకున్నారని ట్రోల్ చేస్తున్నారు. వస్తువులా అవసరానికి వాడుకొని ఆ తర్వాత జాన్వీని పక్కన పెట్టారని సెలిబ్రిటీలు సైతం పోస్ట్‌లు, ట్వీట్స్ పెట్టారు. ఈ విమర్శలపై పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా రియాక్ట్ అయ్యారు. మహిళలను అగౌరవపరచాలనే ఉద్దేశంతో పెద్దిలో జాన్వీ కపూర్ సీన్లను పెట్టలేదని, ఈ పాత్రపై వచ్చిన విమర్శలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించాడు.
క్షమాపణలు చెబుతున్నా....
"సినిమా అన్నది ప్రేక్షకులను అలరించడానికి, వారిలో స్ఫూర్తినింపడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను. ఇతరులను ఇబ్బంది పెట్టేలా గానీ, వారి గౌరవానికి భంగం కలిగించేలా సినిమా ఉండకూడదు. తెరపైనే కాకుండా నిజ జీవితంలో మహిళలను నేను గౌరవిస్తా. ఆడవాళ్లను కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాధపెట్టాయని, వారి మనోభావాలను దెబ్బతీశాయని వస్తోన్న విమర్శలపై మనస్ఫూర్తిగా అందరికి క్షమాపణలు చెబుతున్నా. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ దృష్ట్యా ఆయా సన్నివేశాలలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాం" అని బుచ్చిబాబు అని అన్నారు. భవిష్యత్తులో మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పేలా, వారిని హుందాగా, పవర్‌ఫుల్‌గా చూపించే కథలను రాయటడానికే కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ విమర్శలు, ట్రోల్స్ కారణంగా సినిమాలోని రామ్‌చరణ్, జాన్వీ కపూర్ లిప్‌లాక్ సీన్లను కట్ చేయబోతున్నట్లు సమాచారం.
అథ్లెట్ పోరాటం...
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కించారు. తన ఊరి సమస్యలను పరిష్కరించడం కోసం ఓ అథ్లెట్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగింది. పెద్దిలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Patriot Review | పేట్రియాట్ రివ్యూ - మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
- ●Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు
- ●Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..
- ●Reels | రీల్స్‌కు బాగా అలవాటు పడ్డ జెన్ జీ తరం.. మెటా వెల్లడి..
- ●Trump Towers Hyderabad | ఆకాశాన్ని తాకేలా 64 అంతస్థులు.. కోకాపేటలో 'ట్రంప్ టవర్స్' అల్ట్రా-లగ్జరీ ఇండ్లు

Patriot Review | పేట్రియాట్ రివ్యూ - మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?

Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు

Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..






