త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan Wife | ఓరుగ‌ల్లు భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి అన్నాలెజినోవా వ‌రంగ‌ల్ వ‌చ్చారు. భ‌ద్ర‌కాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అన్నా లెజినోవా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

N

Entertainment | Published On Feb 3, 2026, 6.36 pm IST

Pawan Kalyan Wife | ఓరుగ‌ల్లు భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి
Advertisement

Pawan Kalyan Wife | ఏపీ డిప్యూటీ సీఏం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స‌తీమ‌ణి అన్నా లెజినోవా వ‌రంగ‌ల్‌ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. మంగ‌ళ‌వారం త‌న బంధువుల‌తో క‌లిసి ఓరుగ‌ల్లుకు వ‌చ్చారు అన్నా లెజినోవా. భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధికి చేరుకున్న‌ ఆమెకు ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌ స్వాగ‌తం ప‌లికారు. భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి అన్నా లెజినోవా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అంత‌కుముందు ఆది శంక‌రాచార్యులు, వ‌ల్ల‌భ‌గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకున్నారు. అన్నా లెజినోవాకు అమ్మ‌వారి శేష‌వ‌స్త్రాల‌తో పాటు తీర్థ ప్ర‌సాదాల‌ను ఆల‌య అర్చ‌కులు అంద‌జేశారు. అన్నా లెజినోవా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి గుడిని సందర్శించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

తీన్‌మార్ షూటింగ్‌లో...

ర‌ష్యా దేశానికి చెందిన అన్నా లెజినోవాను 2013లో పెళ్లి చేసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తీన్‌మార్ సినిమాలో అన్నా లెజినోవా ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. ఈ సినిమా షూటింగ్‌లో వీరి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో అన్నా లెజినోవాను ప‌వ‌న్ పెళ్లి చేసుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, అన్నాలెజినోవాకు కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్‌తో పాటు కుమార్తె పొలినా అంజ‌నా ప‌వ‌నోవా ఉన్నారు.

Advertisement
Advertisement