UBS Twitter Review | ఉస్తాద్ భగత్‌సింగ్ ట్విట్టర్ రివ్యూ – పవన్ ఎలివేషన్లు అదుర్స్…కానీ అదొక్కటే మైనస్
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ మార్చి 19న (నేడు) భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలోకి వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Entertainment | Published On Mar 19, 2026, 8.03 am IST
UBS Twitter Review | పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది సందర్భంగా గురువారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఏపీలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్లకు అనుమతులు వచ్చాయి. కానీ నైజాంలో మాత్రం పర్మిషన్స్ లభించలేదు. ఏపీ, ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
పవన్ వన్ మెన్ షో...
పవన్ కళ్యాణ్ ఇమేజ్, స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారట. కంప్లీట్ పవన్ వన్ మెన్ షోగా ఈ మూవీ నిలిచిందని ప్రీమియర్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. పవన్ ట్రేడ్ మార్క్ ఛరిష్మా, భగత్‌సింగ్ పాత్ర తాలూకు ఎలివేషన్లు, పంచ్ డైలాగ్స్, హీరోయిజం అభిమానులకు ఫీస్ట్‌లా ఉంటాయని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. మ్యానరిజమ్స్ వింటేజ్ పవన్‌ను గుర్తుకుతెస్తాయని అంటున్నారు.
ప్రెడిక్టబుల్...
ఉస్తాద్ భగత్‌సింగ్ కథ మాత్రం ఔట్‌డేటెడ్ ఫీలింగ్‌ను కలిగిస్తుందని చెబుతున్నారు. స్క్రీన్‌ప్లే కూడా ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని అంటున్నారు. రొటీన్ రివేంజ్ డ్రామాతో కంప్లీట్ ఓల్డ్ స్కూల్ ఫార్మెట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడట. ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా ఫ్లాట్‌గా ఈ సినిమా మొత్తం సాగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పవన్ స్టెప్పులు, మాస్ మూవ్‌మెంట్స్...
దేవిశ్రీప్రసాద్ పాటల్లో దేఖ్‌లేంగే సాలే పాటకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమని అంటున్నారు. పాటలన్నింటిలో పవన్ తన కాలరే ఎత్తరా పాటలో పవన్ స్టెప్పులు, మాస్ మూవెంట్స్ అదిరిపోతాయని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. తమన్ బీజీఎమ్‌తో థియేటర్లు మోతమోగిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. రాశీఖన్నా, శ్రీలీల పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేదట. వారితో పవన్ కాంబినేషన్‌లో సీన్లు, కామెడీ మాత్రం కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యిందని అంటున్నారు.
తమిళ నటుడు పార్తిబన్‌ను విలన్‌గా తీసుకోవడం ఈ సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చిందని చెబుతున్నారు.
ఓవరాల్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ పవన్ అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. కథ, కథనాల విషయంలో కొత్తదనాన్ని కోరుకునే వారిని మాత్రం ఈ మూవీ డిసపాయింట్ చేస్తుందని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



