త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ustaad Bhagat Singh Trailer | ఈ సారి ప‌ర్ఫార్మెన్స్ బ‌ద్ద‌లైపోద్ది – వింటేజ్ ప‌వ‌న్ ఈజ్ బ్యాక్ – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ట్రైల‌ర్ రిలీజ్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ట్రైల‌ర్ రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైలాగ్స్‌, మ్యాన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Mar 14, 2026, 6.55 pm IST

Ustaad Bhagat Singh Trailer |  ఈ సారి ప‌ర్ఫార్మెన్స్ బ‌ద్ద‌లైపోద్ది – వింటేజ్ ప‌వ‌న్ ఈజ్ బ్యాక్ – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Ustaad Bhagat Singh Trailer | ఓజీ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న మూవీ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీలీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. మార్చి 19న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

ప‌వ‌న్ ఎలివేష‌న్లు...

శ‌నివారం ఉస్తాద్‌భ‌గ‌త్‌సింగ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలివేష‌న్లు, డైలాగ్స్‌, మ్యాన‌రిజంతో పాటు ఆయ‌న‌పై షూట్ చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. జోవియ‌ల్‌గా క‌నిపించే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆద‌ర‌గొట్టారు.

అర్థం...భావం...అవ‌స‌రం..

వ‌య‌లెన్స్ అంటే మీనింగ్ తెలియ‌క మీ అంద‌రికి ఫ్యాష‌న్ అయిపోయింది.అర్థం...భావం అవ‌స‌రం అన్ని చూపిస్తా...ఆయ‌న క‌మ్‌బ్యాక్ ఇచ్చిన ప్ర‌తిసారి మ్యాజిక్ జ‌రుగుద్ది....సంతోషంగా ఉండ‌టం అంటే మ‌న జీవితాన్ని మ‌నం లైక్ చేయ‌డం. మ‌న జీవితానికి ఎవ‌డెవ‌డో లైకులు కొట్ట‌డం కాదు...ఈ దేశ‌పు మ‌గ‌వాడు బొట్టు పెడితే ఎలా ఉంట‌దో చూస్తావా లాంటి డైలాగ్స్ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకుంటున్నాయి.

వింటేజ్ ప‌వ‌న్....

ఈ సారి ప‌ర్ఫార్మెన్స్ బ‌ద్ద‌లైపోద్ది అంటూ ట్రైల‌ర్ చివ‌రలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్‌ను తెప్పిస్తోంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. వింటేజ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించాడ‌ని కామెంట్లు పెడుతున్నారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 15న హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన‌బోతున్నాడు. ఈ ఈవెంట్‌తోనే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూ

Advertisement
Advertisement