Ustaad Bhagat Singh Review | ఉస్తాద్ భగత్‌సింగ్ రివ్యూ – వింటేజ్ పవర్ స్టార్ విశ్వరూపం …పవన్ కళ్యాణ్ మూవీ ఎలా ఉందంటే??
గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ఉస్తాద్‌భగత్‌సింగ్. ఉగాది కానుకగా నేడు థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Mar 19, 2026, 12.58 pm IST
Ustaad Bhagat Singh Review | ఓజీతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు పవన్ కళ్యాణ్. గత ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఓజీ నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉస్తాద్ భగత్‌సింగ్ ఎలా ఉంది? ఈ సినిమాతో గబ్బర్‌సింగ్ మ్యాజిక్‌ను పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ రీక్రియేట్ చేశారా? లేదా? అంటే?
ఉస్తాద్ విధ్వంసం...
చంద్రశేఖర్‌రావు (కె.ఎస్. రవికుమార్) ఎంతో మంది పేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఆదర్శ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకుంటాడు. టీచర్ నుంచి ప్రజాభిమానంతో రాష్ట్రానికి సీఎం అవుతాడు. సీఎం పదవిపై కన్నేసిన చదలమర్రి నల్ల నాగప్ప (పార్తిబన్) చంద్రశేఖర్‌రావుపై హత్యా ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు సీఎం. దాంతో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా నల్ల నాగప్ప నియమితుడవుతాడు. అదే టైమ్‌లో నాగప్ప కొడుకు క్రాంతిని ఉస్తాద్ భగత్‌సింగ్ (పవన్ కళ్యాణ్)అనే పోలీస్ ఆఫీసర్ కిడ్నాప్ చేస్తాడు? సీఎం కొడుకును భగత్‌సింగ్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? ప్రమాదంలో గాయపడిన సీఎం చంద్రశేఖర్‌కు ఉస్తాద్‌భగత్‌సింగ్‌కు ఉన్న సంబంధమేమిటి? భగత్‌సింగ్ జీవితంలోకి వచ్చిన ఆర్‌జే గీత (శ్రీలీల)తో పాటు శ్లోక(రాశీఖన్నా ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
సరికొత్త అర్థం....
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ మూవీ కమర్షియల్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. హీరోయిజానికి సరికొత్త అర్థాన్ని చాటిచెప్పింది. పవన్ ఇమేజ్‌ను, స్టార్‌డమ్, మ్యానరిజమ్స్‌ను డిఫరెంట్ యాంగిల్ లో ఆవిష్కరించారు డైరెక్టర్ హరీష్ శంకర్.
గబ్బర్‌సింగ్ కాంబోలో మరో సినిమా అనగానే ఉస్తాద్‌పై అంచనాలు అమాంతం ఆకాశాన్ని అంటాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ పవన్ ఇమేజ్ చాలా మారింది. అప్పుడో స్టార్ హీరో...ఇప్పుడు ఓ డిప్యూటీ సీఎం. ఆయన్ని స్క్రీన్‌పై చూపించే విషయంలో కొన్ని లిమిటేషన్లు ఏర్పడ్డాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశారు హరీష్ శంకర్. ఆయన రాజకీయ భావజాలం, సామాజిక స్పృహతో పాటు అభిమానులు పవర్ స్టార్ నుంచి కోరుకునే అంశాలతో ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీని తెరకెక్కించారు.
వింటేజ్ పవన్...
కథ విషయంలో దర్శకుడు పెద్దగా రిస్క్ తీసుకోనట్లుగానే అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్‌లతో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. రొటీన్ కాన్సెప్ట్‌కు పవన్ ఇమేజ్‌ను జోడించి ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌చేయాలని ప్రయత్నించారు. సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్, ఎలివేషన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అవన్నీ వింటేజ్ పవన్‌ను గుర్తుకు తెస్తాయి.
ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్...
గబ్బర్‌సింగ్ లాగే ఉస్తాద్ కూడా పవన్‌చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌తోనే మొదలవుతుంది. పసివాడు పవన్ కళ్యాణ్ ఎలా అయ్యాడో చూపించే సీన్ మంచి కిక్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్, రాశీఖన్నాతో అతడి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటాయి. మరోవైపు పదవి కాంక్షతో నాగప్ప వేసే ఎత్తులను చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఫన్ మూవ్‌మెంట్స్‌తో టైమ్‌పాస్ చేశారు డైరెక్టర్. ఇంటర్వెల్ సీన్ బాగుంది.
సెకండాఫ్‌లో శ్రీలీలతో పవన్ లవ్ ట్రాక్‌తో పాటు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో మొదలుపెట్టిన చాలా ప్రశ్నలకు సెకండాఫ్‌లో ఆన్సర్ ఇచ్చారు. నాగప్పపై భగత్‌సింగ్ రివేంజ్ తీర్చుకోవడం కొత్తగానే అనిపిస్తుంది.
వింటేజ్ పవన్ చూపించాలనే తాపత్రయంతో పాత సినిమాల రిఫరెన్స్‌లను సినిమాలో చాలానే వాడేశారు హరీష్ శంకర్. మహేష్‌బాబు కుర్చీ మడతపెట్టితో పాటు ఎన్టీఆర్ టెంపర్ సీన్లను వాడేశారు. చిరంజీవి తరలిరాద తనే వసంతం పాటను వాడిన తీరు బాగుంది. ఇవే కాకుండా పవన్ బ్లాక్‌బస్టర్ సినిమాల తాలూకు రిఫరెన్స్‌లు సినిమాలో చాలానే కనిపిస్తాయి. తొలిప్రేమలోని నీ మనసే పాట ఆకట్టుకుంటుంది. పవన్ పొలిటికల్ ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమాలోని డైలాగ్స్ పేలాయి. అభివృద్ధి పేరు చెప్పి నా కాళ్ళు చేతులు కట్టేయడం మీకు అలవాటే గా....భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు.. యుద్ధాన్ని మధ్యలో ఆపేయమని చెప్పలేదు డైలాగ్స్ ఫ్యాన్స్ కు జోష్ తెప్పిస్తాయి.
చెలరేగిపోయాడు...
ఉస్తాద్ పాత్రలో పవన్ చెలరేగిపోయాడు.తనదైన స్కీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కంప్లీట్ పవన్ వన్ మెన్ షోగా ఈ మూవీ నిలిచింది. రెండున్నర గంటల సినిమాలో రెండు గంటలపైనే పవన్ స్క్రీన్‌పై కనిపించారు. హీరోయిన్లలో శ్రీలీల పాత్రకు కాస్తంత ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది. ఆర్‌జే పాత్రలో ఆమె చేసే అల్లరి, పవన్‌తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకున్నాయి. రాశీఖన్నా రోల్‌కు అంతగా ఇంపార్టెన్స్ లేదు. పార్తిబన్ విలనిజం రొటీన్‌గా ఉంది. రావురమేష్, కేఎస్ రవికుమార్‌తో పాటు మిగిలిన వారి నటన ఓకే అనిపిస్తుంది.టెక్నికల్‌గా దేవిశ్రీప్రసాద్ పాటలు, తమన్ బీజీఎమ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. పాటలన్నీ హుషారుగా సాగుతాయి.
ఉస్తాద్ భగత్‌సింగ్ పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తిపరిచే పక్కా పైసా వసూల్ మూవీ. వింటేజ్ పవన్ మ్యాజిక్ కోరుకునే వారిని ఈ మూవీ మెప్పిస్తుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






