త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | 24 గంట‌ల్లో 29 మిలియ‌న్లు – ట్రెండింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌ ఫ‌స్ట్ సింగిల్‌

Pawan Kalyan | ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఫ‌స్ట్ సింగిల్ ట్రెండ్ అవుతోంది. దేఖ్‌లేంగే సాలా అంటూ సాగిన ఈ పాట‌కు ఇర‌వై నాలుగు గంట‌ల్లో 29 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌కు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Dec 15, 2025, 7.31 pm IST

Pawan Kalyan | 24 గంట‌ల్లో 29 మిలియ‌న్లు – ట్రెండింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌ ఫ‌స్ట్ సింగిల్‌

ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్

Advertisement

Pawan Kalyan | ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా న‌టిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ (Ustaad Bhagat Singh) మూవీలోని ఫ‌స్ట్ సింగిల్‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. దేఖ్‌లేంగే సాలా సాంగ్ ప‌వ‌న్ కెరీర్‌లో రిలీజైన ఇర‌వై నాలుగు గంట‌ల్లో హ‌య్యెస్ట్ వ్యూస్ ద‌క్కించుకున్న లిరిక‌ల్ వీడియోగా రికార్డ్ క్రియేట్ చేసింది. దేఖ్‌లేంగే సాలా పాట‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టెప్పులు, దేవిశ్రీ ప్ర‌సాద్ ట్యూన్స్‌తో పాటు లిరిక్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌లా ఈ సాంగ్ ఉంద‌ని అంటున్నారు. దేఖ్‌లేంగే పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల రిలిక్స్ అందించారు. ఈ పాట స‌క్సెస్‌లో డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌తో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కీల‌కంగా నిలిచిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. చాలా రోజుల మంచి మాస్ సాంగ్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ను చూపించాల‌నే త‌మ ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు.
ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల‌(Sreeleela), రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ఫుల్ స్వింగ్‌లో జ‌రుపుతున్నారు.
ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీ 2026 ఏప్రిల్‌లో రిలీజ్ కానున్న‌ట్లు నిర్మాత‌లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌తో పాటు మ‌రిన్ని అప్‌డేట్స్‌ను రివీల్ చేయ‌బోతున్నారు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న సెకండ్ మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మాస్ హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను నిల‌బెట్టి సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.
తొలుత ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన తేరీ మూవీకి రీమేక్‌గా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తెర‌కెక్కిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ రీమేక్ వార్త‌ల‌ను హ‌రీష్ శంక‌ర్ ఇటీవ‌ల ఖండించారు. సొంత క‌థ‌తోనే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement