Pawan Kalyan | హిందూపూర్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది. పొలిటికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హిందూపూర్ ఎమ్మెల్యేగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Jan 26, 2026, 7.23 pm IST
Pawan Kalyan | హిందూపూర్ ఎమ్మెల్యేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కనిపించబోతున్నారు. అయితే రియల్‌లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. ఓజీ (OG Movie)బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీకి వక్కంతం వంశీ కథను అందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతోన్నాయి.
పొలిటికల్ యాక్షన్...
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలసి ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారట.కాగా ఈ సినిమాలో హిందూపూర్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సొసైటీలోని అవినీతిపై ఓ నిజాయితీపరుడైన ఎమ్మెల్యే ఎలాంటి పోరాటం సాగించాడనే అంశాలతో ఈ మూవీ రూపొందబోతున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్‌ను పోలిన పలు అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయని అంటున్నారు. హిందూపూర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.
ఎప్రిల్ ఫస్ట్ వీక్ నుండి...
ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే షూట్ చేయనున్నారట. ఈ సినిమా కోసం భారీ వ్యయంతో కొన్ని స్పెషల్ సెట్స్ వేస్తున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 32వ మూవీ ఇది.
జైత్ర రామ మూవీస్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పలువురు టాలీవుడ్ టాప్ యాక్టర్స్, టెక్నీషియన్లు పనిచేయబోతున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి మూవీతో పాటు ఓజీ 2 మూవీ చేయనున్నారు పవన్ కళ్యాణ్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



