త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | అప్‌డేట్‌తోనే ఓజీ 2 రికార్డులు – ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సీక్వెల్ క్రేజ్ మామూలుగా లేదుగా!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ2పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఇచ్చిన మాట ప్ర‌కారం ఓజీ 2 వ‌చ్చేస్తున్నాడు అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీయ నిర్మాణ సంస్థ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు ప‌దిహేను గంట‌ల్లోనే 5.79 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

N

Entertainment | Published On Jun 12, 2026, 12.48 pm IST

Pawan Kalyan |  అప్‌డేట్‌తోనే ఓజీ 2 రికార్డులు – ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సీక్వెల్ క్రేజ్ మామూలుగా లేదుగా!
Advertisement

Pawan Kalyan |  ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ రూమ‌ర్ల‌కు పుల్‌స్టాప్ పెడుతూ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు ప‌వ‌ర్ స్టార్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా సెట్స్‌పైకి రాక‌ముందే ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే మ‌రో న్యూస్ చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఓజీ 2 చేయ‌బోతున్న‌ట్లు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

ఫారిన్ నుంచి రాగానే...

గురువారం ఓజీ2పై మేక‌ర్స్ సూప‌ర్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ అత‌డు తిరిగి రాబోతున్నాడు. టైమింగ్ గురించి త‌నే చెబుతాడు. డైరెక్ట‌ర్ సుజీత్ ఫారిన్ నుంచి రాగానే ఓజీ 2 గురించి డిస్క‌స్ చేస్తాం అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీయ నిర్మాణ సంస్థ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మిలియ‌న్ల వ్యూస్‌....

కేవ‌లం ప‌దిహేను గంట‌ల్లోనే ఈ ట్వీట్‌కు 5.79 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. 35 వేల‌కుపైగా నెటిజ‌న్లు లైక్ చేశారు. టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్‌లో హ‌య్యెస్ట్ వ్యూస్ వ‌చ్చిన ట్వీట్‌గా ఓజీ 2 రికార్డును క్రియేట్ చేసింది.

ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్‌...

పొలిటిక‌ల్ డైలాగ్స్ లేకుండా కంప్లీట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ ఉండ‌బోతుంద‌ట‌. ఓజీకి మంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్‌, ఎలివేష‌న్లు ఉండేలా ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఈ సీక్వెల్ కోసం సుజీత్ రెడీ చేస్తున్నార‌ట‌.

ప్యార‌డైజ్ ఆల‌స్యం...

ఓజీ త‌ర్వాత హీరో నానితో బ్ల‌డీ రోమియో సినిమా చేయ‌బోతున్న‌ట్లు సుజీత్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. కానీ నాని ప్యార‌డైజ్ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఈ గ్యాప్‌లో ఓజీ సీక్వెల్ క‌థ‌ను సుజీత్ సిద్ధం చేసేశార‌ట‌. త్వ‌ర‌లోనే ఓజీ2 లాంఛింగ్ ఉంటుంద‌ని అంటున్నారు.

 

Advertisement
Advertisement