త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ustaad Bhagat Singh | ఉస్తాద్ ఊచ‌కోత – వారం ముందుగానే థియేట‌ర్ల‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వారం ముందుగానే థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మార్చి 19కి ప్రీపోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను గురువారం రివీల్ చేశారు మేక‌ర్స్‌.

N

Entertainment | Published On Mar 5, 2026, 12.27 pm IST

Ustaad Bhagat Singh | ఉస్తాద్ ఊచ‌కోత – వారం ముందుగానే థియేట‌ర్ల‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ
Advertisement

Ustaad Bhagat Singh | ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వ‌చ్చేసింది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ వారం ముందే థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మార్చి 26న కాకుండా మార్చి 19న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ రిలీజ్ కానుంది. కొత్త విడుద‌ల తేదీని గురువారం రివీల్ చేశారు.

య‌శ్ టాక్సిక్ వాయిదాప‌డ‌టంతో...

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీని మార్చి 26న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ చాలా రోజుల క్రితం ప్ర‌క‌టించారు. ప్ర‌మోష‌న్స్ కూడా చేశారు. కానీ మార్చి 19న రిలీజ్ కావాల్సిన య‌శ్ టాక్సిక్ మూవీ వాయిదాప‌డింది. ఇరాన్‌, ఇజ్రాయెల్ వార్ కార‌ణంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. య‌శ్ టాక్సిక్ వాయిదాప‌డ‌టంతో ఆ డేట్‌కు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌ను థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నారు. ఉస్తాద్ ఊచ‌కోత మార్చి 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో మొద‌లుకానుంది అంటూ మేక‌ర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఛేంజ్‌...

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన పాట‌లు ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు బీజీఎమ్ మాత్రం దేవిశ్రీప్ర‌సాద్ కాకుండా త‌మ‌న్ అందించ‌బోతున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్ ఎల్ల‌మ్మ‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో బీజీఎమ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తికావ‌డానికే త‌మ‌న్‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.

ఇద్ద‌రు హీరోయిన్లు...

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న శ్రీలీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ తేరీ రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు ఇన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ రూమ‌ర్ల‌ను డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కొట్టిప‌డేశారు. స్ట్రెయిట్ స్టోరీతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది.

Advertisement
Advertisement